ఆ దేశం ప్రమాదకరం.. అమెరికన్లకు తాజా అడ్వైజరీ జారీ
ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరున్న బహమాస్ కు అమెరికన్లను వెళ్లొద్దని పేర్కొంటూ విడుదలైన అడ్వైజరీ ఇప్పుడు వెలుగు చూసింది.
By: Tupaki Desk | 7 April 2025 9:55 AM ISTప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరున్న బహమాస్ కు అమెరికన్లను వెళ్లొద్దని పేర్కొంటూ విడుదలైన అడ్వైజరీ ఇప్పుడు వెలుగు చూసింది. వాస్తవానికి మార్చి 31న అడ్వైజరీని జారీ చేయగా.. తాజాగా వెలుగు చూసింది. పర్యాటకంగా ఎంతో మంచి పేరు ఉన్న ఆ దేశంలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ ట్రావెల్ సూచన చేసినట్లు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో నేరాలు పెరిగిపోవటం.. షార్క్ దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆ దేశానికి టూరిజం కోసం వెళ్లే అమెరికన్లు అప్రమతంగా ఉండాలని పేర్కొంది. వీలైతే ఆ దేశానికి వెళ్లకుండా ఉండటం మంచిదని చెప్పింది. కామన్వెల్త్ దేశాల్లో బహమస్ స్వతంత్ర దేశమన్న సంగతి తెలిసిందే. టూరిజం ప్రధాన ఆకర్షణగా ఉండే ఆ దేశంలో ఇటీవల టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు.
అదే సమయంలో మహిళలపై లైంగిక వేధింపులు.. హత్యలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్లకుండా ఉండటం ఉత్తమమని అమెరికన్లకు ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. బహమస్ సముద్రజలాల్లో షార్క్ దాడుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని.. స్విమ్మింగ్.. బోటింగ్ చేసే వేళలో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మరి ముఖ్యంగా న్యూప్రావిడెన్స్.. గ్రాండ్ బహమా దీవుల్లోని నసౌ.. ఫ్రీపోర్ట్ లో నేరాలు ఎక్కువైనట్లుగా పేర్కొన్నారు.
హోటల్లో అద్దెకు రూంలు తీసుకోవటం సేఫ్ కాదని.. ప్రైవేట్ సెక్యూరిటీ లేని చోట బస చేయటం మంచిది కాదని చెప్పింది. అదే సమయంలో పర్యాటకులు తమ సూచనల్ని పట్టించుకోకుండా గన్స్.. ఆయుధాలు తమ వెంట తీసుకెళ్లటం చట్టవిరుద్ధమని చెప్పింది. రూల్స్ ను అతిక్రమిస్తే ఆ దేశ ఎయిర్ పోర్టు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పింది. అరెస్టు.. జైలు.. ఫైన్ లాంటివి విధిస్తారని.. అందుకే ఆ దేశానికి వెళ్లే అంశంపై జాగ్రత్తగా ఆలోచించుకోవాలని పేర్కొంది.
