Begin typing your search above and press return to search.

యూఎస్ టారీఫ్ నేపథ్యంలో రష్యా చమురు ఆగితే.. భారత్ ఏం చేయాలి..?

ఉక్రెయిన్ తో వార్ నేపథ్యంలో పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా నుంచి చమురు కొనే దేశాలకు అమెరికా టారీఫ్ లు విధించింది.

By:  Tupaki Desk   |   12 Aug 2025 2:00 PM IST
యూఎస్ టారీఫ్ నేపథ్యంలో రష్యా చమురు ఆగితే.. భారత్ ఏం చేయాలి..?
X

ఉక్రెయిన్ తో వార్ నేపథ్యంలో పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా నుంచి చమురు కొనే దేశాలకు అమెరికా టారీఫ్ లు విధించింది. అందులో భారత్ ను ప్రధానంగా ట్రంప్ టార్గెట్ చేశాడు. ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయద్దని అగ్రరాజ్యం భారత్ కు చెప్పింది. అయినా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు ఆపలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ట్రంప్ 25 శాతం టారీఫ్ ను భారత్ పై విధించాడు. అయినా దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ ట్రాంప్ కు లొంగలేదు. దీంతో మరో 25 శాతం టారీఫ్ లను విధించాడు. ఈ టారీఫ్ లు ఆగస్ట్ 27 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే 27వ తేదీ తర్వాత అమెరికాకు వెళ్లే భారత్ సరుకులపై 50 శాతం టారీఫ్ ఉంటుంది. ట్రంప్ చెప్పింది వినకుంటే భవిష్యత్ లో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా చమురుపై దేశంలో చర్చ మొదలైంది. ఇంత టారీఫ్ లను భరిస్తూ రష్యా నుంచి చమురు కొంటే దేశానికి కలిగే లాభం ఏంటి? అలాగే నష్టం ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..

తక్కువ ధరకు ఆఫర్ చేస్తున్న రష్యా

చమురు ఉత్పత్తిలో రష్యా అగ్రదేశంగా గుర్తింపు సంపాదించుకుంది. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభమైన తర్వాత అంటే 2022, ఫిబ్రవరి నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాపై సాంక్షన్స్ విధించాయి. దీంతో ఏం చేయాలో తోచక రష్యా తక్కువ ధరకే ముడిచమురును ఆఫర్ చేసింది. దీంతో మన దేశం రష్యా నుంచి చమురు కొంటూ వస్తుంది. ఇది ఇప్పటికి భారత్ కు మేలు చేసింది. ఇక ట్రంప్ టారీఫ్ ల నేపథ్యంలో రష్యా నుంచి ఇంధన కొనుగోలును మనం ఆపేస్తే 9 బిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఎస్బీఐ ఒక రీసెర్చ్ లో తెలిపింది. 2026-2027 వరకు ఇది 11.7 బిలియన్ డాలర్లకు చేరుతుందని సర్వే చెప్తోంది.

చమురు విషయంలో రష్యా ఆదుకుంటుంది...

భారత్ ముడి చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతిపైనే ఆధారపడ్డాం. రష్యా చమురు బ్యారెల్ కు కేవలం 60 డాలర్లు మాత్రమే. 2019-2020లో రష్యా వాటా 1.7 శాతం. 2024-2025 వరకు అది 35.1 శాతంకు చేరింది. దీంతో మనకు అతిపెద్ద చమురు దిగుమతి చేసుకునే దేశంగా రష్యా మారింది. 2024-2025లో మొత్తం 245 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును దిగుమతి చేసుకుంటే అందులో 88 ఎంఎంటీ రష్యా నుంచే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంకు ముందు ఇరాక్ వద్ద చమురు కొనేవారం.

ధరలు అమాంతం పెరగచ్చు..

చమురు సరఫరా దేశాలలో రష్యాకు ప్రపంచంలోనే 10 శాతం వాటా ఉంది. ట్రాంప్ టారీఫ్ లకు భయపడి చాలా వరకు దేశాలు రష్యా నుంచి చమురును కొనడం నిలిపేస్తే ధరలు అమాంతం పెరుగుతాయి. అంటే దాదాపు 10 శాతం మేర పెరగచ్చని ఎస్బీఐ సర్వే చెప్తోంది.

ఇతర దేశాల వైపు చూడచ్చు..

ఇక మనదేశం విషయానికి వస్తే ట్రంప్ టారీఫ్ లకు భయపడి రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించుకొని మరికొన్ని దేశాల నుంచి కొనుగోలు చేయవచ్చు. అలా అయితే భారత్ పై చమురు భారం పెరగవచ్చు అని ఎస్బీఐ సూచనలు చేస్తుంది. మోడీ ఇతర దేశాల పర్యటనలో భాగంగా వివిధ చమురు ఉత్పత్తి దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 40 దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. వీటితో పాటు కొత్తగా కెనడా, గయానా, బ్రెజిల్ చేరాయి. కానీ భారత్ రష్యా నుంచి కంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే భారం పెరుగుతుందని చెప్పవచ్చు.