భారత్ – పాక్ కాల్పుల విరమణ... 48 గంటల్లో జరిగిందిదే!
గత మూడు రోజులుగా భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 May 2025 7:49 PM ISTగత మూడు రోజులుగా భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ వందల డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించిందని భారత్ చెప్పింది.. భారత్ యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్థాన్ చెప్పుకుంది. పాక్ మనుగడకు ముప్పు ఏర్పడితే ప్రపంచంలో ఎవరూ మిగలరని పాక్ గట్టిగానే హెచ్చరించింది.
వైమానిక దాడులు చేయకుండా పాకిస్థాన్ గగనతలంలో పౌర విమానాలు నడుపుతుంది అని భారత్ ఆరోపించింది.. మదర్సాలలోని పిల్లలే మాకు రెండో రక్షణ శ్రేణి అనడంలో సందేహం లేదని పాక్ రక్షణ మంత్రి తెగేసి చెప్పారు. భారత్ లోని స్కూళ్లు, హాస్పటల్స్ పైనా పాక్ దాడులు చేస్తుందని భారత్ చెప్పింది.. భారత్ బాలిస్టిక్ క్షిపణులు వాడుతుందని పాక్ ఆరోపించింది!
ఇక అటు ఇటు పదుల సంఖ్యంలో ప్రజలు మృతువాత పడ్డారని, గాయలపాలయ్యరని కథనాలొచ్చాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ.. శుక్రవారం రాత్రి భారత్ పై పాక్ క్షిపణులతో విరుచుకుపడిందని భారత్ తెలిపింది. ఇలా రకరాకల ఆరోపణలు, ప్రత్యారోపణల వేళ శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించాయి ఇరు దేశాలు.
దీంతో... ఇది అతిపెద్ద సంచలనంగా మారింది. దీనిపై భారత్, పాక్ విదేశాంగ మంత్రులు క్లారిటీ ఇచ్చారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. అంతకంటే ముందు ఇది అమెరికాతో సాధ్యమైందని ట్రంప్ పో స్ట్ పెట్టారు. ఈ సమయంలో గత 48 గంటల్లో ఏమి జరిగిందనే విషయాలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు.
అవును... గడిచిన 48 గంటల్లో.. ప్రధాన మంత్రులు మోడీ, షెహబాజ్ షరీఫ్.. విదేశాంగ మంత్రి జైశంకర్.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, ఆసిం మాలిక్ వంటి సీనియర్ భద్రత, పాకిస్థాన్ అధికారులతో తాను, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చర్చలు జరిపినట్లు మార్కో రూబియో తెలిపారు.
ఈ సమయంలో... భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణకు, తటస్థ ప్రదేశంలో విస్తృత సమస్యలపై చర్చలు ప్రారంభించడానికి అంగీకరించాయని ప్రకటించడానికి తాను సంతోషిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా... శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రధాన మంత్రులు మోడీ, షరీఫ్ ల జ్ఞానం, వివేకం, రాజనీతిజ్ఞతను తాము అభినందిస్తున్నట్లు రూబియో తెలిపారు.
అంటే... భారత్ చెప్పినట్లు సరిహద్దుల్లో వందల డ్రోన్లతో పాకిస్థాన్ విరుచుకుపడుతుందని.. వాటిని మన సైన్యం తిప్పికొడుతుందని చెప్పినప్పటి నుంచే ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నమాట! ఏది ఏమైనా... సరిహద్దుల్లో బాంబుల మోతలు, మీడియాలో వార్ బ్రేకింగ్ లు ఆగిపోయినట్లే!!
