పాక్ దొంగ బుద్ధిని ప్రపంచానికి చెప్పిన యూఎస్ తాజా రిపోర్టు
ప్రపంచ ఉగ్రవాదుల కర్మాగారంగా పాకిస్థాన్ మారిందన్నవిషయాన్నిఇప్పటికి పలుమార్లు భారతదేశం చెప్పటమే.. దీనికి సంబంధించిన ఆధారాల్ని ప్రపంచం ముందు పెట్టిన సంగతి తెలిసిందే.
By: Garuda Media | 29 March 2026 11:00 AM ISTప్రపంచ ఉగ్రవాదుల కర్మాగారంగా పాకిస్థాన్ మారిందన్నవిషయాన్నిఇప్పటికి పలుమార్లు భారతదేశం చెప్పటమే.. దీనికి సంబంధించిన ఆధారాల్ని ప్రపంచం ముందు పెట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికి అగ్రరాజ్యం అమెరికా మొదలు.. ప్రాశ్చాత్య దేశాలు సైతం పెద్దగా స్పందించని దుర్మార్గం కొన్నేళ్లుగా చూస్తున్నదే. అయితే.. కాలం ఎప్పుడూ ఒకటేలా ఉండదన్న విషయం తాజాగా రుజువైంది.
ఎన్నో ఏళ్లుగా..పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాల గురించి.. ఉగ్ర కార్యకలాపాలపై నెత్తి నోరు కొట్టుకున్నా..ఫలితం లేని పరిస్థితి. ఈ క్రమంలో అమెరికా చట్టసభకు సంబంధించి ఒక రీసెర్చ్ రిపోర్టు.. పాక్ ఉగ్ర లింకుల మీద భారతదేశం ఇన్నాళ్లుగా చెప్పిన అంశాల్నే యూఎస్ తాజా రిపోర్టు వెల్లడించింది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఇంకా ఆశ్రయం కల్పిస్తూనే ఉందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాల్ని అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ తన తాజా రిపోర్టులో వెల్లడించింది.ఇందులో పేర్కొన్న అంశాల్నిచూస్తే..
- భారత్ ను లక్ష్యంగా చేసుకొని కార్యకలాపాలు కొనసాగిస్తుస్తున్నారు.
- ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఇప్పటికి ఆశ్రయంకల్పిస్తూనే ఉంది.
- లష్కరేతోయిబా.. జైషేమహ్మద్ లాంటి ఉగ్ర సంస్థలు పాక్ కేంద్రంగా పని చేస్తున్నాయి.
- తీవ్రవాదంతో ఆ దేశం ప్రభావితమైంది
- 2021లో అఫ్గాన్ లో తాలిబన్లు అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆ ఉగ్ర సంస్థలు మరింత బలపడ్డాయి.
- ఉగ్రదాడులు మరింతగా పెరిగాయి.
- తాజా రిపోర్టులో పేర్కొన్న అంశాలకు సంబంధించి వివిధ వర్గాలుగా పేర్కొన్నారు.
- వీటిల్లో ముఖ్యమైంది దేశీయంగా.. అంతర్జాతీయంగా..మరికొన్ని అఫ్గాన్ కు సంబంధించినవిగా పేర్కొన్నారు
- భారత్ లోని కశ్మీర్ ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రసంస్థలు పని చేస్తున్నారు.
- అల్ ఖైదా తీవ్రంగా బలహీనపడింది
- తాను బలంగా లేనప్పటికి లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తోంది.
- తెహ్రీక్ -ఇ- తాలిబన్ పాకిస్థాన్ లోనే అత్యంత ప్రాణాంతక ఉగ్ర సంస్థగా పేరును సొంతం చేసుకుంది.
