భారత్ - పాక్ యుద్ధం వస్తే మేము అటు వైపే.. వాషింగ్‌టన్ సంచలన నిర్ణయం?
అమెరికా ఒకవైపు గ్లోబల్ పార్టనర్‌షిప్ గురించి మాట్లాడుకుంటూనే, మరోవైపు తన ‘స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్’కే ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేయడం అంతర్జాతీయ దౌత్య నీతిలోని అసలు రంగును బయటపెట్టింది.
By: Tupaki Political Desk | 1 April 2026 2:00 PM ISTఅమెరికా ఒకవైపు గ్లోబల్ పార్టనర్‌షిప్ గురించి మాట్లాడుకుంటూనే, మరోవైపు తన ‘స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్’కే ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేయడం అంతర్జాతీయ దౌత్య నీతిలోని అసలు రంగును బయటపెట్టింది. తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం, భవిష్యత్తులో పాకిస్థాన్‌తో యుద్ధం వస్తే అమెరికా భారత్‌కు ‘ఆటోమేటిక్ సపోర్ట్’ ఇవ్వబోదని, వాషింగ్టన్ తన సొంత ప్రయోజనాలకే కట్టుబడి ఉంటుందని సీనియర్ అమెరికన్ అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. అంటే, భారత్ తన పోరాటాన్ని తనే సొంతంగా సాగించాల్సి ఉంటుందని అర్థం. ఈ నేపథ్యంలో, గణాంకాల ప్రకారం భారత్- పాకిస్థాన్ సైనిక బలాబలాలపై లోతుగా చూస్తే.
భారత్ ఆధిపత్యం!
సైనిక శక్తి విషయంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత్ 4వ స్థానంలో (PwrIndx: 0.1346) ఉండగా, పాకిస్థాన్ 14వ స్థానానికి (PwrIndx: 0.2626) పడిపోయింది. రెండేళ్లుగా పాకిస్థాన్ ర్యాంకింగ్ క్షీణిస్తోంది (2024లో 9వ స్థానం నుంచి 2026లో 14వ స్థానానికి) ఇది ఆ దేశ ఆర్థిక సంక్షోభం సైన్యంపై చూపుతున్న ప్రభావాన్ని సూచిస్తోంది. ఆర్థికంగా, సైనికుల సంఖ్య పరంగా భారత్ చాలా వేగంగా ముందుకు కదులుతుంది. భారత్ వద్ద సుమారు 1.45 మిలియన్ల యాక్టివ్ సైనికులు ఉండగా, పాకిస్థాన్ వద్ద కేవలం 6.5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. రిజర్వ్ ఫోర్స్‌లో కూడా భారత్‌దే పైచేయి. భారత్ రక్షణ బడ్జెట్ ను పరిశీలిస్తే సుమారు $75 బిలియన్లు, అదే పాకిస్థాన్‌ది కేవలం $7.6 - $9.1 బిలియన్ల మధ్యే ఉంది. ఈ భారీ బడ్జెట్ వల్ల భారత్ అత్యాధునిక ఆయుధాలను, స్వదేశీ పరిజ్ఞానాన్ని సమకూర్చుకోగలుగుతోంది.
సముద్రంలో సైతం భారత్ రారాజు!
యుద్ధ సమయంలో కీలకమైన నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో భారత్ స్పష్టమైన ఆధిక్యతను కలిగి ఉంది. భారత్ వద్ద 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 13 డిస్ట్రాయర్లు ఉన్నాయి. పాకిస్థాన్ వద్ద ఇవేవీ లేవు. పాక్ నేవీ ప్రధానంగా తీరప్రాంత రక్షణకే మాత్రమే పరిమితం. భారత్ 'బ్లూ వాటర్ నేవీ'గా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. భారత్ వద్ద సుమారు 2,200 పైగా విమానాలు ఉండగా, పాకిస్థాన్ వద్ద 1,400 లోపే ఉన్నాయి. కాంబాట్ జెట్స్ సంఖ్యలో కూడా భారత్ చాలా ముందుంది.
అణు సామర్థ్యంతో..
అణు ఆయుధాల విషయంలో రెండు దేశాలు దాదాపు సమాన స్థాయిలో ఉన్నాయి. భారత్ వద్ద సుమారు 180 అణు బాంబులు ఉండగా, పాకిస్థాన్ వద్ద 170 ఉన్నట్లు అంచనా. దక్షిణ ఆసియా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణు ప్రాంతంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక చిన్న సరిహద్దు ఘర్షణ కూడా అణు యుద్ధానికి దారితీసే ముప్పు పొంచి ఉంది.
స్ట్రాటజిక్ రియలిజం!
అమెరికా వైఖరిలో కనిపిస్తున్న ఈ మార్పు భారత్‌కు ఒక హెచ్చరిక లాంటిది. అమెరికా భారత్‌ను కేవలం చైనాను అడ్డుకోవడానికి ఒక 'కౌంటర్ వెయిట్' గానే చూస్తోంది తప్ప, పాకిస్థాన్‌తో యుద్ధం వస్తే ప్రాణాలకు తెగించి సాయం చేయదు. ‘భారత్ తన యుద్ధాన్ని తనే పోరాడాలి’ అనే అమెరికా సందేశం.. భారత్ తన స్వదేశీ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
అమెరికా మద్దతు ఉన్నా లేకపోయినా, పైన గణాంకాలు భారత్ సైనిక ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే, యుద్ధం అనేది కేవలం ఆయుధాలతోనే కాదు, ఆర్థిక వ్యవస్థతో కూడా ముడిపడి ఉంటుంది. పాకిస్థాన్ తన ఆర్థిక స్థితిగతుల వల్ల బలహీనపడినా, అణు ఆయుధాలు ఉండడం వల్ల భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అమెరికా తన ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పిన తరుణంలో, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే భారత్ ముందున్న ఏకైక మార్గం. అసలు అమెరికా వేలు పెట్టకుండా ఉంటె ఆపరేషన్ సింధూర్ టైం లోనే పాక్ పని అయ్యి ఉంటుంది అని భారతీయులు అంటున్నారు .
