Begin typing your search above and press return to search.

యుద్ధం వేళ మోదీకి ట్రంప్ ఫోన్.. ఏంటి కథ అంటే?

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి కీలక చర్చలు జరిపారు.

By:  A.N.Kumar   |   24 March 2026 11:35 PM IST
యుద్ధం వేళ మోదీకి ట్రంప్ ఫోన్.. ఏంటి కథ అంటే?
X

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకీ ముదురుతున్న వేళ ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి కీలక చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, వాటి వల్ల ప్రపంచ ఆర్థికంపై పడే ప్రభావం.. ముఖ్యంగా భారత్‌ , అమెరికాపై పడే ఆర్థిక విపత్తు గురించి ఇద్దరు నేతలు సవివరంగా చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రత్యేకంగా హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభంపై ఈ సంభాషణలో ప్రధానంగా దృష్టి సారించారు. ప్రపంచానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో అనేక వాణిజ్య నౌకలు చిక్కుకుపోయిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. దీనివల్ల ఇంధన సరఫరాలు, వాణిజ్య రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించి అంతర్జాతీయ నౌక రవాణా సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

భారత్ పశ్చిమకుసియా ప్రాంతంతో ఉన్న ఆర్థిక, వాణిజ్య, ఇంధన సంబంధాలు దృష్ట్యా, ఈ యుద్ధ పరిస్థితులు దేశంపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా చమురు దిగుమతులు, భారతీయుల భద్రత, విదేశీ మారక నిల్వలు వంటి వాటిని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తున్నట్లు సమాచారం.

ఇక దేశ ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా ప్రధాని మోదీ ఇప్పటికే ఉన్నారు. యుద్ధం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలు ధైర్యంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. భారత్‌తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఇలాంటి సంక్షోభాలను కలిసి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం ప్రపంచానికి మరింత సవాళ్లు విసురుతున్న వేళ, భారత్-అమెరికా సమన్వయం కీలకంగా మారింది. రెండు దేశాలు తీసుకునే భవిష్యత్తు పరిణామాలపై ప్రభావం చూపే అవకాశమున్నందున, అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.