Begin typing your search above and press return to search.

ఇండియా వెళ్ళారో ఇక రారు...హెచ్ 1బీ వీసాదారులకు అమెరికా వార్నింగ్

అమ్మను చూడాలనో...అమ్మమ్మను చూడాలనో...ఫ్రెండ్స్ తో జాలీగా ఇండియాలో ట్రిప్పులు కొట్టాలనో...ఇతర ఏ కారణాలైనా సరే ఇప్పుడు మాత్రం ఇండియా వెళ్ళకండి.

By:  Tupaki Desk   |   12 Dec 2025 1:11 PM IST
ఇండియా వెళ్ళారో ఇక రారు...హెచ్ 1బీ వీసాదారులకు అమెరికా వార్నింగ్
X

అమ్మను చూడాలనో...అమ్మమ్మను చూడాలనో...ఫ్రెండ్స్ తో జాలీగా ఇండియాలో ట్రిప్పులు కొట్టాలనో...ఇతర ఏ కారణాలైనా సరే ఇప్పుడు మాత్రం ఇండియా వెళ్ళకండి. మొండికేసి వెళ్ళారో చిక్కులు తప్పవని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏళ్ళుగా ఇండియాకు రాలేక పోయినా చాలా మందికి ఇది నిరుత్సాహం కలగించే వార్త. పాపం అయినవాళ్ళను చూసి చాలాకాలమై...సొంతిల్లు...సోంతూరు...సొంత మనుషులతో నోరారా మాట్లాడక మొహం వాచిఉన్న భారతీయులకు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. ఇంతకూ ఇండియాకు వస్తే ఏమవుతుంది? అంటే కారణాలున్నాయి మరి.

డాలర్ల వేటలో పడి స్వదేశాన్ని వీడి అమెరికాకు వెళ్లిన వలస ఉద్యోగుల పరిస్థితి నానాటికీ కష్టంగా మారుతోంది . ప్రధానంగా హెచ్ 1బీ వీసాలున్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలని అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ అటార్నీలు అంటున్నారు. భారత్ లో డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి దాకా వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడటంతో ...ఇక్కడికి వస్తే తిరిగి వెళ్ళడం కష్టం..స్టాంపింక్ పడక చిక్కుల్లో చిక్కుకునే ప్రమాదముంది. ఉద్యోగాలు ఊడిపోతాయి. సకాలంలో మళ్ళీ అమెరికాకు రాలేరు. ఇలాంటప్పుడు రిస్క్ తీసుకుని మరీ ఇండియా వెళ్ళడం అవసరమా అంటున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు.

భారత్ లో వీసా ఇంటర్వ్యూలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అమెరికాలో కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక కుదరదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే హెచ్1బీ వీసాల జారీలో, రెనీవల్ లో బోల్డన్ని చిక్కులు ఉంటున్నాయి. కోరికోరి కొత్త చిక్కులు కొనితెచ్చుకోకండని భారతీయులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు హితవు పలుకుతున్నారు. వందలాది మంది హెచ్1బీ వీసాదారులు ఇంటర్వ్యూల కోసం ఇండియా వచ్చిన నేపథ్యంలో అమెరికా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

భారత్ లో వీసా ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇంటర్వ్యూలు వాయిదా పడిన విషయంగా హెచ్1బీ వీసాదారులకు చివరి నిమిషంలో మెసేజులు వచ్చాయి. అమెరికా కంపెనీలు చాలా కాలం వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించవని, కార్యాలయాలకు రావల్సిందిగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు సమాచారం ఇస్తున్న నేపథ్యంలో భారతీయులు కోరికోరి ఇబ్బందుల్లో పడటం మంచిది కాదు. అది ఉద్యోగానికే ప్రమాదం అయ్యే అవకాశాలున్నాయి.

ట్రంప్ సారథ్యంలో మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ నినాదం కొనసాగుతునే ఉంది. కేవలం ఈ నినాదం వల్లనే అమెరికన్లు ట్రంప్ మహాశయుడికి రెండోసారి అధికారం కట్టబెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2.0 వెర్షన్ చాల భయంకరంగా ఉంటోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు విదేశాలకే కాదు అమెరికాకు కూడా కష్టంగా మారుతోంది. వీసాల జారీ విషయంగా ట్రంప్ చాల కఠినంగా వ్యవహరిస్తున్నారు. వలస నియంత్రణకు కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు అమెరికన్లకు ఇది మంచిగా అనిపించవచ్చు. ఎందుకంటే...విదేశీలు అమెరికన్ల అవకాశాలను కొల్లగొడుతున్నారని, అందుకు తాను అడ్డుకట్ట వేస్తానని ట్రంప్ ఎన్నికల్లో శపథం చేశారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటదాకా 85వేల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. సో ఇండియన్లూ కాసింత జాగ్రత్త ఇక్కడి వారిపై ప్రేమ పొంగుకొచ్చి ....హోమ్ సిక్ అంటూ వచ్చారో తిరిగి వెళ్ళడం కష్టం.