యూఎస్ వీసా పోర్టల్ క్రాష్...క్రాష్...
హెచ్1బీ వీసాదారులకు కొత్త చిక్కు పట్టుకుంది. విపరీతమైన రద్దీ కారణమో మరొకటో తెలీదు గానీ యూఎస్ వీసా షెడ్యూలింగ్ వెబ్ సైట్ క్రాష్ అయిపోయింది.
By: Tupaki Desk | 18 Dec 2025 5:50 PM ISTహెచ్1బీ వీసాదారులకు కొత్త చిక్కు పట్టుకుంది. విపరీతమైన రద్దీ కారణమో మరొకటో తెలీదు గానీ యూఎస్ వీసా షెడ్యూలింగ్ వెబ్ సైట్ క్రాష్ అయిపోయింది. మీ హెచ్1బీ వీసా స్టాంప్ రినీవల్ అపాయంట్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందంటూ వీసా రినీవల్ దరఖాస్తుదారులకు మెసేజ్ వస్తోంది. రద్దీ పెరిగిపోవడం వల్ల లోడ్ ఎక్కువై వెబ్ సైట్ క్రాష్ అవడం వల్లే ఈ తరహా మెసేజ్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీఏసీ అపాయింట్ మెంట్ రద్దు చేసుకోడానికి వెబ్ సైట్ లో లాగిన్ కావడానికి వీల్లేని పరిస్థితి.
అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ పుణ్యమా అని హెచ్ 1బీ వీసా కోసం ప్రయత్నించేవారికి, రినీవల్ కోరేవారికి వస్తున్న కష్టాలు మామూలు కావు. అమెరికా వీసా అంటేనే సీన్ సితారా అనేటట్లుంది వ్యవహారం. రోజుకో నిబంధనతో ట్రంప్ అమెరికా వచ్చేవారిని రఫ్ ఆడించేస్తున్నాడు. ఇపుడు పులిమీద పుట్రలా హెచ్1బీ వీసా ప్రయత్నించేవారికి కొత్త సమస్య వచ్చి పడింది... అదే వెబ్ సైట్ క్రాష్ డౌన్ అయిపోవడం. ఇధి సాంకేతిక సమస్యే కావచ్చు..కానీ ఈ పరిస్థితి వీసా రినీవల్ చేసుకునే వారిని చిక్కుల్లోనే కాకుండా అయోమయంలో నెట్టేస్తోంది.
వెబ్ సైట్ ఓపన్ చేస్తే వెయిటింగ్ లాబీ వద్దే పోర్టల్ స్టక్ అయిపోయింది గమనించవచ్చు. వెయిటింగ్ లాబీ నుంచి లాగిన్ స్క్రీన్ దాకా లాగిన్ అయ్యే అవకాశమే కనిపించదు. అక్కడిదాకా స్క్రీన్ కదలదు. గంటల తరబడి వెయిట్ చేసినా పేజీ సరిగా లోడ్ కాదు. కొన్ని సార్లు యాక్సస్ లభించినా...ఫెయిల్ అవుతుంటుంది. మరి కొన్ని సందర్భాల్లో లాగిన్ పేజీకి వెళ్ళినా...లాగిన్ పనిచేయదు అక్కడ మొరాయిస్తుంటుంది. ఒకవేళ లాగిన్ పనిచేసినా...మీ అకౌంట్ ను లేదా అపాయింట్మెంట్ వివరాలను చెక్ చేసుకునే వీలుండదు. అంతా కన్ఫ్యూజన్...గందరగోళం. కంప్యూటర్ ముందు కూర్చున్న వారు తలపట్టుకోవాల్సిందే. మీలాగే ఇబ్బుందులు ఎదుర్కొంటున్ వారికి కూడా ఆటోమెటిక్ గా వీఏసీ క్యాన్సిల్ అయ్యిందేమో తెలుసుకుందామంటే సరైన సమాధానం లభించదు. అసలే వెబ్ సైట్ లో యాక్సెస్ లభించక ఇబ్బంది పడుతుంటే...కనీసం ఇతరుల నుంచి సరైన సమాచారం కూడా మీకు సకాలంలో లభించదు.
ఈ పరిస్థితికి కారణం సర్వర్ దెబ్బతినడమో లేదా మెయింటెనెన్స్ లో ఉండటమో అనిపిస్తుంది. ఈ మధ్యన వేల సంఖ్యల్లో హెచ్1బీ వీసా క్యాన్సిలేషన్ ప్రక్రియ వల్ల ట్రాఫిక్ పెరిగిపోవడం...వీసాదారులు రీ షెడ్యూల్ కోసం ఒకే సమయంలో పదే పదే ప్రయత్నిస్తుండటం కూడా ప్రధాన కారణాలని చెప్పాలి. వెబ్ సైట్ లో ఉన్నట్టుండి రద్దీ పెరగడంతో సిస్టం లోడ్ తట్టుకోలేకనే ఇలా అయిఉండవచ్చు. లాగిన్ ఫెయిల్ అవుతోందని వదలకుండా పదే పదే ప్రయత్నిస్తే ఏదో సమయంలో క్లిక్ అవుతుంది...ఇది ఒక దరఖాస్తుదారుని అనుభవం. ఇలా పదే పదే లాగిన్ కు ప్రయత్నంచడం వల్ల కూడా సిస్టం క్రాష్ అయ్యే ప్రమాదముంది. అనుభవమున్న వారు చెప్పేది ఒక్కటే ఓపిగ్గా పదేపదే ప్రయత్నించండి అని. పోర్టల్ యాక్సెస్ రానిపక్షంలో మీ అపాయింట్మెంట్ స్టేటస్ మీకు తెలిసిరాదు. మరో స్టెప్ కు వెళ్ళడం కుదరదు. నిత్యం వేలాది మంది ఆధార పడే ఈ వెబ్ సైట్ కు సాంకేతిక సమస్యలు చుట్టుముట్టడం ...పరిష్కరించలేక పోవడం వల్ల హెచ్1బీ వీసాదారు కష్టాలు మరింత పెరిగిపోతున్నాయి.
