దేశంలోని టాప్ 7 నగరాల్లో ఆఫీసు స్పేస్ అద్దెకు తీసుకున్నది ఆ కంపెనీలేనట
ఆసక్తికర రిపోర్టు ఒకటి బయటకు వచ్చింది. దేశంలోని టాప్ 7 నగరాల్లో అత్యధికంగా స్థలాల్ని లీజుకు తీసుకున్న సంస్థల వివరాల్ని వెల్లడయ్యాయి
By: Tupaki Desk | 15 Jun 2025 3:00 PM ISTఆసక్తికర రిపోర్టు ఒకటి బయటకు వచ్చింది. దేశంలోని టాప్ 7 నగరాల్లో అత్యధికంగా స్థలాల్ని లీజుకు తీసుకున్న సంస్థల వివరాల్ని వెల్లడయ్యాయి. ఆసక్తికరంగా మొత్తం లీజ్ లో 33.3 శాతం సంస్థలు అమెరికాకు చెందినవే కావటం గమనార్హం. 2022-24 మధ్య దేశంలోని ఏడు పెద్ద నగరాల్లో 6.5 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ ను అమెరికా సంస్థలు అద్దెకు తీసుకున్న విషయాన్ని జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది.
ఇది మొత్తం ఆఫీసు స్పేస్ లో 33.3 శాతంగా పేర్కొంది. ఢిల్లీ - ఎన్ సీఆర్, ముంబయి, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, ఫుణె మార్కెట్లలో మొత్తం 19కోట్ల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. వీటిల్లో ఎక్కువగా అమెరికా కంపెనీలు లీజ్ కు తీసుకున్నాయి. భారత్ లో నిపుణుల లభ్యత ఎక్కువగా ఉండటం.. ఖర్చులు తక్కువగా ఉండటం దీనికో కారణంగా పేర్కొంటున్నారు.
ఈ అమెరికా కంపెనీల దీర్ఘకాలిక పెట్టుబడులు.. రీసెర్చ్ - డెవలప్ మెంట్ కేంద్రాల ఏర్పాటుతో దేశాన్ని ఆవిష్కరణ హబ్ గా మార్చేందుకుసాయం చేస్తుందని చెబుతున్నారు. తాజా రిపోర్టులో అమెరికా కంపెనీలు దేశంలోని టాప్ 7 నగరాల్లో తమ ఓటు బెంగళూరు మహానగరానికి వేస్తున్నట్లుగా జేఎల్ఎల్ రిపోర్టు వెల్లడించింది.
