Begin typing your search above and press return to search.

చైనా లేడీతో ప్రేమ.. ఉద్యోగం పోగొట్టుకున్న అమెరికా బ్యూరోక్రాట్

చైనా మహిళతో ప్రేమాయణం ఓ అమెరికా దౌత్యవేత్త ఉద్యోగం కోల్పోడానికి కారణమైంది. దౌత్యాధికారి తన ప్రేమను దాచిపెట్టడం, ఆ మహిళ గూఢాచారి అన్న అనుమానంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   9 Oct 2025 5:00 PM IST
చైనా లేడీతో ప్రేమ.. ఉద్యోగం పోగొట్టుకున్న అమెరికా బ్యూరోక్రాట్
X

చైనా మహిళతో ప్రేమాయణం ఓ అమెరికా దౌత్యవేత్త ఉద్యోగం కోల్పోడానికి కారణమైంది. దౌత్యాధికారి తన ప్రేమను దాచిపెట్టడం, ఆ మహిళ గూఢాచారి అన్న అనుమానంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. చైనీయులతో ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం యూఎస్ గతంలోనే నిషేధించింది. అయినప్పటికీ ఆ దౌత్యాధికారి చైనా మహిళతో ప్రేమాయణం కొనసాగించడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది.

ఈ విషయమై యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమీక్షించిన తర్వాత దౌత్యాధికారిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ ప్రతినిధి టామీ పిగోట్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రేమ వ్యవహారం నడిపిన దౌత్యవేత్త పేరు మాత్రం అమెరికా వెల్లడించకపోవడం విశేషం. దౌత్యవేత్తను ఉద్యోగం నుంచి తొలగిస్తున్న అమెరికా ప్రకటించడంతో ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

జాతీయభద్రతను ద్రుష్టిలో పెట్టుకుని అమెరికా ఈ చర్య తీసుకున్నట్లు చెబుతున్నారు. అమెరికా-చైనా రెండు దేశాలు తమ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తుంటాయి. ఒకరి రహస్యాలు మరొకరికి చేరకుండా అప్రమత్త పాటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రభుత్వం తరఫున చైనాలో పని చేస్తోన్న సిబ్బందికి అమెరికా గతంలోనే కీలక హెచ్చరికలు చేసింది.

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ క్లియరెన్స్ కలిగిన కాంట్రాక్టర్లు చైనీయులతో శారీరక సంబంధాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. గతంలో మాస్కోలో నావికాదళ ఉద్యోగి సోవియట్ గూఢచారి ప్రలోభానికి గురయ్యారు. దాంతో అప్పటి సోవియట్కూటమి చైనాలోఉన్న సిబ్బంది స్థానికులతో స్నేహం చేయడం, డేటింగ్ చేయడం లేక లైంగిక సంబంధం పెట్టుకోకుండా 1987లో యూఎస్ ప్రభుత్వం నిషేధించింది.