Begin typing your search above and press return to search.

ట్రంప్ సుంకాల ఉగ్రరూపంపై చైనా ఇంట్రస్టింగ్ రియాక్షన్!

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే "అమెరికా ఫస్ట్" పాలసీకి అనుగుణంగా "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" కోసం పని చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 April 2025 12:55 PM IST
U.S.-China Trade War Escalates
X

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే "అమెరికా ఫస్ట్" పాలసీకి అనుగుణంగా "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" కోసం పని చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న సుంకాల దాడుల నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ సమయంలో చైనా ఆసక్తికరంగా స్పందించింది.

అవును... ఇటీవల కాలంలో భారత్ సహా ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా స్పందించిన వైట్ హౌస్... 75కు పైగా దేశాలు కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఇప్పటికే తమను సంప్రదించాయని.. అందువల్ల సుంకాలను ప్రస్తుతానికి నిలిపేశామని చెబుతూ.. "ఒక్క చైనాపై తప్ప" అని ముగించింది!

ఈ నేపథ్యంలో... చైనా ఎగుమతులపై ఏకంగా 245% సుంకాలను అమెరికా విధించింది. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ విమానాల ఆర్డలు తీసుకోవద్దని చైనా తమ కంపెనీలను ఆదేశించడం.. ఖనిజాల ఎగుమతిని నిలిపేయడమే దీనికి కారణం అని తెలుస్తోంది. దీంతో.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరినట్లయ్యిందని అంటున్నారు.

వాస్తవానికి గతంలో అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలను విధించిన చైనా.. శుక్రవారం వాటిని 125 శాతానికి పెంచింది. ఈ సమయంలో అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై చైనా ప్రస్తుతం 245% సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేసింది. ఈ సమయంలో చైనా స్పందించింది.

ఈ విషయాలపై తాజాగా స్పందించిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... సుంకాల సమస్యపై చైనా తన గంభీరమైన వైఖరిని పదే పదే ప్రకటించిందని చెప్పిన లిన్.. అసలు ఈ సుంకాల యుద్ధాన్ని మొదలుపెట్టిందే అమెరికా అని నొక్కి చెప్పారు.

ఇక బీజింగ్ తన చట్టబద్దమైన హక్కులు, అంతర్జాతీయ న్యాయాన్ని కాపాడే విషయంలో పూర్తిగా సహేతుకమైన, చట్టబద్ధమైన వైఖరిని కలిగి ఉందని తెలిపారు. ఇక ఈ సుంకాలు, వాణిజ్య యుద్ధాలకు విజేతలు ఉండరని చెప్పిన లిన్... ఈ యుద్ధాలతో పోరాడాలని చైనా కోరుకోదని.. అదే సమయంలో ఇలాంటి వాటికి భయపడదని స్పష్టం చేశారు.

అంతక ముందు ఎక్స్ వేదికగా స్పందించిన లిన్ జియాన్... అనిశ్చితులతో నిండిన ప్రపంచంలో చైనా చేతులు కలపడానికి కట్టుబడి ఉందని.. పంచులు విసరడం లేదని.. అడ్డంకులను తొలగించడానికి ఉంది, గోడలు నిర్మించడం లేదని.. కనెక్టివిటీని ప్రోత్సహించడం తప్ప విడిపోవడాన్ని అనుసరించడం లేదని పేర్కొన్నారు.

కాగా మంగళవారం చైనాపై ప్రశనలకు స్పందించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్... చైనాపై ట్రంప్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని అన్నారు. ఇదే సమయంలో.. ఈ విషయంలో బంతి చైనా కోర్టులోనే ఉందని.. చైనా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలి తప్ప.. అమెరికా వారితో ఒప్పందం కుదురుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.