Begin typing your search above and press return to search.

తుర్కియేతో అమెరికా వ్యాపార విన్యాసం.... భారత్ అలెర్ట్ కావాల్సిందేనా ?

అగ్ర రాజ్యం అమెరికాను పూర్తిగా నమ్మడం అన్నది దౌత్యపరంగా సరైన నిర్ణయం కాదు అనే దౌత్య నిపుణులు అంటారు

By:  Tupaki Desk   |   17 May 2025 1:47 PM IST
తుర్కియేతో అమెరికా వ్యాపార విన్యాసం.... భారత్ అలెర్ట్ కావాల్సిందేనా ?
X

అగ్ర రాజ్యం అమెరికాను పూర్తిగా నమ్మడం అన్నది దౌత్యపరంగా సరైన నిర్ణయం కాదు అనే దౌత్య నిపుణులు అంటారు. అమెరికాతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక భారత్ కి మొదటి నుంచి మద్దతుగా నిలిచిన దేశం రష్యా. రష్యా సోవియట్ యూనియన్ గా ఉన్నపుడు ప్రపంచంలో రెండు దృక్కోణాలు ఉండేవి. ఆనాడు భారత్ సోవియట్ యూనియన్ తోనే ఉండేది.

ఇక రష్యాతోనే భారత్ కి నిజమైన మిత్ర బంధమూ ఉంది. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ వైపు నిలబడింది కూడా రష్యానే అని అంతా గుర్తు చేస్తున్నారు. ఆనాడు చూస్తే పాకిస్థాన్ కి అమెరికా చైనా రెండూ అండగా నిలబడ్డాయి. అయినా రష్యా సాయం భారత్ శౌర్యం దేశానికి ఘన విజయాన్ని ఇచ్చాయి.

ఇక 1991 సోవియట్ యూనియన్ పతనం తరువాత ఏక ధృవ ప్రపంచంగా మారిన నేపధ్యంలో అమెరికాతో భారత్ కొత్త స్నేహం మొదలైంది. అయితే అది వ్యూహాత్మకమైన దోస్తీగానే ఉంది. భారత్ ప్రజాస్వామిక దేశం, అమెరికా ప్రజాస్వామిక దేశం. అలా రెండు దేశాల మధ్య సహజ సిద్దమైన స్నేహం ఉందని అమెరికా ఎంత చెప్పినా భారత్ మాత్రం తన జాగ్రత్తలో తాను ఉండాల్సిన అవసరం అనేక సార్లు రుజువు అవుతూనే వచ్చింది.

తాజాగా చూసినా అమెరికా పాక్ తోనూ దోస్తీ చేస్తూ భారత్ ని కట్టడి చేయాలని చూస్తోంది అని అంటున్నారు. భారత్ పాక్ ని రెండింటినీ ఒకే గాటకు కట్టాలన్న అమెరికా స్నేహ నీతిని కూడా అంతా గమనిస్తున్నారు. 2000లో వరల్డ్ సెంటర్ ని కూల్చివేసిన పాక్ ఉగ్ర భూతం విషయాన్ని అమెరికా చాలా కన్వీనియెంట్ గా మరచి మరీ దోస్తీ చేస్తోంది అంటే ఆలోచించాల్సిన విషయమే.

ఇక భారత్ విషయం తీసుకుంటే అమెరికాతో సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయని అనుకున్నా సమయానికి వచ్చేసరికి మాత్రం భారత్ ని ఇబ్బంది పెట్టే లాగానే వ్యవహరిస్తోంది అని అర్ధం అవుతోంది. తాజాగా చూస్తే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్ మీద తన నిజ స్వరూపం చాటుకుంటున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది.

యాపిల్ సంస్థ భారత్ లో పెట్టుబడులు పెట్టవద్దని ట్రంప్ ఒక అధ్యక్ష స్థానంలో ఉండి సలహాల రూపంలో ఆదేశాలు జారీ చేస్తున్నారు అంటే చాలానే ఆలోచించాల్సి ఉందని అంటున్నారు. అంతే కాదు భారత్ పాక్ ల మధ్య అణు యుద్ధాన్ని నివారించాను అని చెప్పడం, కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తాను అని తనకు తానుగా ప్రకటించడం చూస్తూంటే అమెరికా అతి ఉత్సాహానికి ఎక్కడో ఒక చోట భారత్ బ్రేకులు వేయాల్సిందే అని అంటున్నారు.

అందుకే భారత్ కూడా పాక్ విషయంలో ద్వైపాక్షిక చర్చలనే కోరుకుంటున్నామని చెబుతోంది. మూడవ దేశం జోక్యం అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టంగా చెప్పారు.

ఇక లేటెస్ట్ గా చూస్తే అమెరికా చేసిన మరో పని భారత్ ఆ దేశాన్ని నమ్మవచ్చా అన్న చర్చకు రేకెత్తించేలా చేస్తోంది. పాక్ భారత్ ల మధ్యలో దూరి తగుదునమ్మా అని జోక్యం చేసుకుని పాక్ కి ఆయుధాల సాయం చేసిన తుర్కియాకు అమెరికా అత్యాధునిక మిసైల్ ని అమ్మడానికి సిద్ధం కావడాన్ని ఏ విధంగా చూడాలని అంతా అంటున్నారు.

తాజాగా చూస్తే కనుక తుర్కియేకు ఏకంగా 19వేల కోట్ల రూపాయలు విలువైన అమ్రామ్ క్షిపణులను విక్రయించే ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక వైపు తుర్కియే తన దుష్ట బుద్ధితో పాక్ కి ఆయుధాలు ఇచ్చి మరీ భారత్ కి వ్యతిరేకంగా నిలబడిన వేళ అమెరికా ఇచ్చే ఈ అత్యాధునిక ఆయుధాలు తుర్కియే నుంచి పాక్ కి చేరి భారత్ మీదకు ప్రయోగించబడవా అన్న చర్చ వస్తోంది. భారత్ పట్ల స్నేహం నటిస్తూ అమెరికా చేస్తున్న ఈ వ్యాపార విన్యాసం తో అగ్ర రాజ్యాన్ని ఎంత వరకూ నమ్మాలి అన్న చర్చ సాగుతోంది.