షుగర్ పేషెంట్స్ మూత్రంతో విస్కీ... ఎలా, ఎందుకో తెలుసా?
ప్రపంచంలో వ్యర్థం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు, మసాజ్ మ్యాట్ లు మొదలైనవి తయారు చేస్తూ రీసైక్లింగ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 May 2025 8:00 AM ISTప్రపంచంలో వ్యర్థం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు, మసాజ్ మ్యాట్ లు మొదలైనవి తయారు చేస్తూ రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అవన్నీ కాదు ఏకంగా మానవ మూత్రాన్ని రీసైక్లింగ్ చేయాలని భావించాడో వ్యక్తి.. ఆ మూత్రంతో ఏకంగా విస్కీ తయారు చేస్తున్నారు. ఇప్పుడు యూకేలో అది బాగా ఫేమస్!
అవును... యూకే లోని జేమ్స్ గిల్పిన్ అనే వ్యక్తి కొత్త రకం విస్కీని తయారు చేసి, ఎన్నో ఏళ్లుగా సంచలనంగా మారారు. ఇందులో భాగంగా డయాబెటిస్ ఉన్న రోజుల మూత్రంతో విస్కీ తయారుచేస్తున్నారు. అదే ఎందుకంటే.. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారి మూత్రంలో చక్కెరను విసర్జిస్తారు.. అందువల్ల ఆ మూత్రంలోని చక్కెరను వృధా చేయకూడదనే నిర్ణయించుకున్నారు!
ఆ నిర్ణయంలో నుంచి ఈ విజయం దక్కిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన గిల్పిన్... టైప్-టూ డయాబెటిక్ రోగులు పెద్ద మొత్తంలో చక్కెరను విసర్జిస్తారని.. దీంతో వారి మూత్రాన్ని సేకరించి, నీటి శుద్ధీకరణ వ్యవస్థలను ఉపయోగించి, దానితో విస్కీ తయారు చేస్తున్నట్లు తెలిపారు! దానికి "గిల్పిన్ ఫ్యామిలీ విస్కీ" అని నామకరణం చేశారు.
ఇలా డయాబెటిస్ ఉన్నవారి చక్కెరతో నిండిన మూత్రంతో తయారు చేయబడిన ఈ హై ఎండ్ సింగిల్ మాల్ట్ విస్కీకి ముందుగా.. అతని అమ్మమ్మే దాత కూడా! వాస్తవానికి తొలుత దీన్ని చాలా మంది చెత్త ఆలోచన అని కొట్టిపారేసినా.. తర్వాత కాలంలో కొత్త ఆలోచనగా అభివర్ణించి అభినందించారని చెబుతున్నారు! ఇదే సమయంలో.. వ్యర్ధాల నిర్వహణ ప్రాముఖ్యతపైనా ఇది అవగాహన కల్పిస్తోందని అంటున్నారు.
