Begin typing your search above and press return to search.

యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు.. సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి..

భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగాయి. వీటిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) అత్యంత ప్రజాదరణ పొందుతున్నది.

By:  Tupaki Desk   |   10 Sept 2025 4:13 PM IST
యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు.. సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి..
X

భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగాయి. వీటిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) అత్యంత ప్రజాదరణ పొందుతున్నది. కిరణా దుకాణం నుంచి కోట్ల రూపాయల పెట్టుబడుల దాకా అన్నీ యూపీఐ ద్వారా సులువుగా సాగిపోతున్నాయి. ఈ నేపథ్యంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూర్చబోతున్నది.

లావాదేవీల పరిమితి పెంపు

ఈ నెల 15వ తేదీ నుంచి నుంచి యూపీఐ చెల్లింపుల పరిధి మరింత విస్తృతం కానుంది. ఇప్పటివరకు సాధారణ వినియోగదారులు ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.1 లక్ష మాత్రమే పంపగలిగారు. ఇకపై ప్రత్యేక కేటగిరీల్లో ఒకేసారి రూ.5 లక్షల వరకు, రోజుకు రూ.10 లక్షల వరకు చెల్లించేలా వెసులుబాటు ఉండనుంది. దీనివల్ల బీమా ప్రీమియం, క్రెడిట్ కార్డు బిల్లులు, ట్రావెల్ బుకింగ్స్, ప్రభుత్వ సంబంధిత చెల్లింపులు, ఇతర పెట్టుబడులకు సంబంధించి అన్నీ ఒకే ప్లాట్‌ఫాంలో సులభంగా చేసుకోవచ్చు.

వ్యాపారులకు లాభం

మర్చంట్ పేమెంట్స్ లేదా వ్యాపార లావాదేవీలకు ఒక్కో ట్రాన్సాక్షన్ రూ.5 లక్షల వరకు పరిమితం కాగా, రోజువారీ మొత్తానికి ఎలాంటి లిమిట్ ఉండదు. ఇది ముఖ్యంగా రిటైల్ వ్యాపారులు, జ్యువెలరీ డీలర్లు, పెద్ద మర్చంట్‌లకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. దీంతో బ్యాంక్ ట్రాన్స్ఫర్లు లేదా ఇతర చెల్లింపు మార్గాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, యూపీఐ ద్వారానే పెద్ద మొత్తాలను మరింత సులభంగా చెల్లించవచ్చు.

సాధారణ వినియోగదారుల సంగతేంటి?

వ్యక్తిగత స్థాయిలో పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్లకు పాత విధానమే అమలులో ఉంటుంది. అంటే, ఒకరి నుంచి మరొకరికి పంపే డబ్బు రూ.1 లక్షలోపు ఉండాలి. అయితే బీమా, స్టాక్ మార్కెట్, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ వంటి ప్రత్యేక రంగాల్లో చెల్లింపుల పరిధి పెరగడం వల్ల, సాధారణ వినియోగదారులు కూడా పెద్ద చెల్లింపులను జాప్యం లేకుండా చేసుకోవచ్చు.

యూపీఐకి మరింత ప్రాధాన్యం

యూపీఐ ప్రారంభమైనప్పుడు చిన్న చిన్న లావాదేవీలు మాత్రమే చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ ప్రధాన పేమెంట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఎన్‌పీసీఐ కొత్త నిర్ణయంతో బ్యాంకులపై ఒత్తిడి తగ్గిపోగా, డిజిటల్ లావాదేవీలలో పారదర్శకత, వేగం మరింత పెరగనుంది.

యూపీఐ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నపేమెంట్ మోడల్. ఇప్పుడు పెద్ద లావాదేవీలకు కూడా అదే వేదిక కానుండడం విశేషం. దీంతో డిజిటల్ ఇండియా లక్ష్యం మరింత బలపడనుంది.వినియోగదారులు ఇకపై బ్యాంక్ డ్రాఫ్ట్‌లు, చెక్కులు, నెట్ బ్యాంకింగ్‌లపై ఆధారపడకుండా పెద్ద మొత్తాల చెల్లింపులు చేసే అవకాశం ఒక సరికొత్త దిశగా భావించవచ్చు