Begin typing your search above and press return to search.

జయప్రద.. పరారీలో ఉన్న నిందితురాలు వెంటనే అరెస్టు చేయండి

అయితే.. ఆమెను పరారీలో ఉన్న నిందితురాలిగా పేర్కొన్న ప్రత్యేక కోర్టు.. ఆమెను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు

By:  Tupaki Desk   |   28 Feb 2024 4:54 AM GMT
జయప్రద.. పరారీలో ఉన్న నిందితురాలు వెంటనే అరెస్టు చేయండి
X

ప్రముఖలకు ఒక అలవాటు ఉంటుంది. వారు చేసే తప్పులు కోర్టు ముందుకు వెళ్లటం.. న్యాయస్థానాలకు హాజరుకావాలన్న తాఖీదులు రావటం.. ఆ వేళలో గాయబ్ అయ్యే ప్రముఖులు పలువురు కనిపిస్తుంటారు. ఆ కోవలోకే చెందుతారు ప్రముఖ సినీ నటి.. మాజీ ఎంపీ కం బీజేపీ నేత జయప్రద. అయితే.. ఆమెను పరారీలో ఉన్న నిందితురాలిగా పేర్కొన్న ప్రత్యేక కోర్టు.. ఆమెను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రత్యేక కోర్టు మంగళవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆమెపై రెండు కేసులు ఉన్నాయి వాటి విచారణ నిమిత్తం కోర్టు ఎదుట హాజరు కావాలని పేర్కొన్నా.. ఇప్పటివరకు ఆమె గైర్హాజరు అవుతూనే వచ్చారు. ఇప్పటివరకు ఏడుసార్లు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ అయ్యాయి. అయినప్పటికి ఆమె కోర్టుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆమెను.. పరారీలో ఉన్న నిందితురాలిగా పేర్కొన్నారు. వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.

అంతేకాదు.. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు వీలుగా డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని రాంపూర్ లో ఏర్పాటు చేసిన నేతల కేసుల్ని తేల్చే ప్రత్యేక కోర్టు పేర్కొంది. మార్చి ఆరో తేదీ నాటికి కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. ఇంతకూ జయప్రద మీద ఉన్న కేసు ఏమిటన్నది చూస్తే.. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఆమెపై వచ్చాయి.

2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. రాంపూర్ నుంచి పోటీ చేసిన ఆమె.. సమాజ్ వాడీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల వేళలో ఆమెపై ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. వీటి విచారణకు గౌర్హాజరు కావటం ద్వారా తాజాగా కోర్టు చేత.. ‘‘పరారీలో ఉన్న నిందితురాలు’’గా పేర్కొనేలా చేసుకున్నారు. విషయం ఇంత సీరియస్ అయ్యే వరకు ఎందుకు అవకాశం ఇస్తారన్న విస్మయం వ్యక్తమవుతోంది.