బహరాయిచ్ తోడేళ్లు అక్కడి నుంచే వచ్చాయా..?
ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ ప్రాంతంలో తోడేళ్ల కదలికలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
By: Tupaki Desk | 29 Sept 2025 5:22 PM ISTఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ ప్రాంతంలో తోడేళ్ల కదలికలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం సాయంత్రం కైసర్‌గంజ్ ప్రాంతంలోని మగ తోడేలు సంచరిస్తున్నట్లు గురించడంతో గ్రామాల్లో భయాందోళనలు చెలరేగాయి. ఆ తోడేలు నరభక్షకి అని స్థానికులు చెప్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తర్వాతే నిజా నిజాలు బయటకు వస్తాయని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తోడేల దాడులు పెరుగుతున్నాయి. గతంలో స్థానికులపై జరిగిన దాడుల్లో నాలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు, 16 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిస్థితులు గ్రామాల ప్రజల్లో భయాన్ని పెంచి ప్రతిరోజూ నిద్రలేమి భయం వారి చుట్టూ ఆవహిస్తోంది.
ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పటిష్ట చర్యలు..
తోడేళ్ల నివారణకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే అనేక భద్రతా పరమైన చర్యలు చేపట్టింది. తోడేల కోసం డ్రోన్లను ఉపయోగించి సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. అడవుల్లో గాలిస్తోంది.. ఆరు తోడేళ్లను పట్టుకుంది. ఈ క్రమంలో తోడేల కదలికలు, ప్రత్యేకంగా మగతోడేలు గ్రామ ప్రాంతాలకు చేరడం, స్థానికుల భయాన్ని మరింత పెంచుతోంది. సామాజిక, భౌగోళిక కోణంలో పరిశీలిస్తే.. గ్రామాల భద్రతకు వన్యప్రాణులు సవాలు మారుతున్నాయి. గ్రామీణ వ్యవస్థలో భయాందోళన పెరిగితే వ్యవసాయ పనులు ఆలస్యం కావడం వంటి ప్రభావాలు ఉంటాయి. గ్రామాలు తోడేళ్ల స్థిరమైన నివాస స్థలాలుగా మారుతున్నాయి.
అవగాహనతోనే భద్రత..
ప్రభుత్వం, అటవీ శాఖ స్థానికులకు అవగాహన, ప్రివెన్షన్ మార్గదర్శకాలతో ముందుకు వెళ్లడం అవసరం. భద్రతా పద్ధతులు, మానవ–వన్యప్రాణి సహజ, సహవాస మార్గాలను అంచనా వేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పెంచవచ్చు. అలాగే, స్థానికులు కూడా పెంపుడు జంతవులు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
అడవులు, గ్రామాల మధ్య సమన్వయం..
అడవీ, గ్రామాల మధ్య సహజ సమన్వయం లేకపోతే, మానవ-వన్యప్రాణి ఘర్షణలు పెరుగుతాయి. భద్రతా చర్యలు, ముందస్తు గాలింపులు, సాంకేతిక పద్ధతులు, వన్యప్రాణి నివారణ విధానాలు సమన్వయం చేయాలి. ఈ క్రమంలో, స్థానికుల జీవితాలు, ప్రకృతి సమతుల్యత రెండింటినీ కాపాడడం సాధ్యమవుతుంది.
