Begin typing your search above and press return to search.

ఆనంద్‌ మహీంద్రాను బాదపెట్టిన దృశ్యం ఇది!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   22 Nov 2023 6:25 AM GMT
ఆనంద్‌  మహీంద్రాను బాదపెట్టిన దృశ్యం ఇది!
X

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనేది తెలిసిన విషయమే. ఆన్ లైన్ వేదికగా సామాజిక, ఆర్ధిక, యువతకు సంబంధించిన ఎన్నో విషయాలపై ఆయన స్పందిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆయన రియాక్షన్స్ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వైరల్‌ వీడియోపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం మరింత వైరల్ అవుతుంది.

అవును... ఆనంద్‌ మహీంద్రా ఓ వైరల్‌ వీడియోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వీడియో తనను ఎంతో బాదపెట్టిందని తెలిపారు. ఈ వీడియోలో కనిపించిన దృశ్యం సామాజిక బాధ్యతను విస్మరించడమే అని ఆయన అన్నారు. పర్యావరణం పట్ల పౌరుల దృక్పథం మారకపోతే.. నగర జీవన నాణ్యత మెరుగుపడదని తెలిపారు.

వివరాళ్లోకి వెళ్తే... ముంబయిలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద అరేబియా సముద్రంలో కొందరు వ్యర్థాలను పడేశారు. ఇందులో భాగంగా పెద్ద పెద్ద సంచుల నిండా చెత్తను తీసుకువచ్చి అందరూ చూస్తుండగానే సముద్రంలో పడేసి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఇలా పూర్తి బాధ్యతారాహిత్యంగా పర్యావరణానికి హాని తలపెట్టే విధంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.

దీంతో ఈ విషయాన్ని ముంబై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇందులో భాగంగా అలా వ్యర్థాలను పాడేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. ఇదే సమయంలో అరెస్టైన ఆ వ్యక్తికి ముంబయి ఘన వ్యర్థాల నిర్వహణ సంస్థ రూ. 10 వేల జరిమానాను విధించింది.

ఈ సమయంలో వైరల్ అవుతున్న ఈ వీడియో, తదనంతర పరిణామాలపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ఇందులో భాగంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా స్పందించిన ఆయన... ఈ వీడియోను చూస్తుంటే ఎంతో బాధగా ఉందని అన్నారు. పర్యావరణం పట్ల పౌరుల దృక్పథం మారనిపక్షంలో.. నగర జీవన నాణ్యత మెరుగుపడదు అని అన్నారు. తన పోస్టుకు ఆ వీడియోను కూడా జత చేశారు.

దీంతో ఈ పోస్ట్ పై నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఆనంద్ మహీంద్రా తో గొంతుకలుపుతున్నారు. ఇందులో భాగంగా... ప్రకృతి విపత్తులు ఏ స్థాయిలో జరుగుతున్నా.. వాతావరణంలో ఊహించని మార్పులు వస్తున్నా.. జనాల్లో మార్పులు రాకపోతే.. మరిముఖ్యంగా నగర జీవనం నరక కూపంగా మారే ప్రమాదం పొంచి ఉందని కామెంట్లు చేస్తున్నారు.