Begin typing your search above and press return to search.

దోపిడీలపై స్టోరీకి వెళ్లిన మీడియా టీంను దోచేశారు

చికాగోకు చెందిన యూని విజన్ చికాగో టీవీ చానల్ రిపోర్టర్.. కమెరామన్ లు సంచలన కథనం చేసేందుకు ప్లాన్ చేశారు

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:13 AM GMT
దోపిడీలపై స్టోరీకి వెళ్లిన మీడియా టీంను దోచేశారు
X

రోటీన్ కు భిన్నమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు ఒక మీడియా సంస్థ ప్రతినిధులు. ప్రజలకు హాట్ .. హాట్ న్యూస్ చూపించాలని తపించిన ఆ సంస్థ జర్నలిస్టులకు.. రివర్సు గేరులో వారే వార్తగా మారిన సిత్రం అమెరికాలో చోటు చేసుకుంది. చికాగో మహానగరంలో జరిగే దొంగతనాలు.. దోపిడీలపై స్టింగ్ ఆపరేషన్ చేసేందుకు వెళ్లిన టీవీ టీంను దొంగలు అడ్డంగా దోచేశారు. ఈ షాకింగ్ ఉదంతం ఎలా చోటు చేసుకుందంటే..

చికాగోకు చెందిన యూని విజన్ చికాగో టీవీ చానల్ రిపోర్టర్.. కమెరామన్ లు సంచలన కథనం చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడి దొంగతనాలు.. దోపిడీలకు పాల్పడే ముఠాల మీద స్టోరీ చేయాలని డిసైడ్ చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టోరీల్ని చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాందేమీ చేయలేదు.

స్టోరీ చేసేందుకు నార్త్ మిల్వాకే అవెన్యూ ప్రాంతానికి వెళ్లారు. వీడియో రికార్డింగ్ మొదలు పెట్టే వేళలో.. బ్లాక్ ఎస్ వీయూ కారు ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి ముగ్గురు దుండగులు పిస్టల్ తో బెదిరించి.. సదరు చానల్ కు చెందిన జర్నలిస్టుల వద్ద ఉన్న నగదు.. ఫోన్లు మొదలు కొని కెమెరా సామాను వరకు దోచేశారు. అనంతరం వారి దారినవారు వెళ్లిపోయారు. కాసేపటికి ఈ షాక్ నుంచి తేరుకున్న వారు.. పోలీసులకు సమాచారాన్ని అందించారు.

ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు బిక్కముఖం వేసుకొని ఉన్న సదరు చానల్ సిబ్బంది కనిపించారు. తనకు ఎదురైన అనుభవం గురించి స్పందించిన రిపోర్టర్.. తమపై ఇలాంటి వార్త ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న ఆయన.. ఒక అంశంపై రిపోర్టింగ్ చేసేటప్పుడు.. ఆ అంశానికి సంబంధించి తానే బాధితుడిగా మారతానని తాను అస్సలు ఊహించలేదన్నారు. ఈ తరహా రిపోర్టింగ్ చేసే వేళలో మరింత అప్రమత్తతతో పాటు.. జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని వార్నింగ్ ఇచ్చే ఉదంతంగా పేర్కొన్నారు.