Begin typing your search above and press return to search.

చివరి రోజు వరకూ ఆయనే ప్రధానిగా ... షాకింగ్ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి

జమిలి అయినా ముందస్తు అయినా మోడీ మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టడం కోసం వేసిన ఎత్తుగడ మాత్రమే అని అనుమానిస్తునాయి.

By:  Tupaki Desk   |   3 Sep 2023 1:01 PM GMT
చివరి రోజు వరకూ ఆయనే ప్రధానిగా ...  షాకింగ్ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి
X

కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికల కోసం ఆరాటపడుతోందని, తద్వారా ప్రజాభిప్రాయాన్ని అనుకూలం చేసుకుని మూడవ విడత కూడా కేంద్రంలో అధికారంలో కొనసాగేందుకు స్కెచ్ వేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జమిలి అయినా ముందస్తు అయినా మోడీ మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టడం కోసం వేసిన ఎత్తుగడ మాత్రమే అని అనుమానిస్తునాయి. అదే మాటను గట్టిగానే అంటున్నాయి.

ఈ నేపధ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా ఎపుడు వస్తాయి అన్న ఆలోచనలతో దేశంలోని రాజకీయ పార్టీలు తలమునకలు అవుతున్నాయి. కొత్తగా ఇండియా పేరిట కూటమి కట్టిన నేపధ్యంలో ఆ కూటమి నేతల హడావుడి మామూలుగా లేదు. అయితే ముందస్తు తధ్యమని అందుకోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఈ నెల 18 నుంచి 22 వరకూ నిర్వహిస్తున్నారు అని కూడా డౌటానుమానాలు ఎన్నో పెరిగిపోతున్న నేపధ్యంలో అంతా తూచ్ అని ఒక్క మాటతో షాక్ ఇచ్చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్.

కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ముందస్తుకు వెళ్ళే ఆలోచన ఏదే లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతే కాదు మోడీకి ప్రజలు ఇచ్చిన అధికారంలో చివరి రోజు వరకూ ఆయనే ప్రధానిగా ఉంటారని, ఏ ఒక్క రోజూ వదులుకోరని కూడా పక్కా క్లారిటీ ఇచ్చారు. ముందస్తు కానీ జమిలి కానీ అసలు జరిగే పనులు కావని కొట్టి పారేశారు.

తాము జమిలి అంటూ ఈ ఏడాది డిసెంబర్ లో జరితే అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేయిస్తున్నట్లుగా వస్తున్న పుకార్లను సైతం ఆయన పూర్తిగా తిరస్కరించారు. అలా ఏదీ జరగదని ఆయన అంటున్నారు. 2024 మేలోనే షెడ్యూల్ ప్రకారమే లోక్ సభకు ఎన్నికలు జరుగుతాయని ఠాకూర్ అంటున్నారు. ఈ విషయంలో రెండవ మాటకు చోటు లేదని కూడా చెప్పేసారు.

ఇదంతా మీడియా సృష్టి మాత్రమే అన్నారు. ఇదిలా ఉంటే జమిలి ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీని కేంద్రం అపాయింట్ చేయడం ఆ కమిటీలో కీలక మెంబర్స్ ని పెట్టడంతో ఏదో జరుగుతోంది అన్న డౌట్లు అందరిలో మొదలయ్యాయి.

ఇక ఆ తరువాత చూసుకుంటే ఈ నెల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేయడం, ఈ సమావేశాలు అయ్యేంతవరకూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీస్ ఢిల్లీ దాటి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేయడంతో ఆ అనుమానాలు మరింత పెద్దవి అయ్యాయి. దాంతో ఏదో జరుగుతోంది అన్న చర్చ అయితే బయల్దేరింది.

ఈ వేడి అంతటా ప్రజ్వరిల్లుతూండగానే అబ్బే ముందస్తు లేదు మరోటి లేదు అంటూ కేంద్ర మంత్రి క్లారిటీ ఇవ్వడాన్ని ఎలా చూడాలి అన్నదే ఇపుడు ప్రశ్నగా ముందుకు వస్తోంది. నిజంగా ముందస్తు అన్న ఆలోచన కేంద్రం మదిలో ఉన్నా అది లాస్ట్ మినిట్ దాకా బయట పెట్టదు కదా అన్న వారూ ఉన్నరు. సో కేంద్ర మంత్రి కామెంట్స్ ని అలాగే చూడాలా లేక సీరియస్ గా తీసుకోవాలా అన్నదే విపక్షాలకు అయితే తెలియడంలేదు అంటున్నారు. ఏది ఏమైనా దేశంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అది ముందస్తా జమిలా అన్నది మాత్రమే కొద్ది రోజులలో తేలనుంది అని అంటున్నారు.