Begin typing your search above and press return to search.

తెలంగాణలో రేవంత్ మార్కు... అధికారికంగా ఇకపై టీజీ!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది

By:  Tupaki Desk   |   18 May 2024 5:54 AM GMT
తెలంగాణలో రేవంత్  మార్కు... అధికారికంగా ఇకపై టీజీ!
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇందులో భాగంగా తీసుకున్న మరో కీలక నిర్ణయమే తెలంగాణ వాహనాల నెంబర్‌ ప్లేట్ల మీద టీఎస్‌ కు బదులుగా టీజీగా మార్చాలను కోవడం. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గెజిట్‌ కూడా విడుదల చేసింది. మార్చి 15వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు.

అవును... తెలంగాణ రాష్ట్రంలో ఇకపై "టీఎస్" అనే అక్షరాలు కనిపించవు.. ఆ స్థానంలో "టీజీ" వచ్చి చేరింది. తాజాగా ఇది అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. మే 31 లోపు తెలంగాణలో ప్రభుత్వ, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మార్పుని గుర్తించడంతోపాటు పాటించాల్సి ఉంటుంది. తక్షణమే ఈ మార్పు అమలులోకి వస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం గా తన మార్కు చూపించే క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదీ ఒకటని చెప్పుకోవచ్చు! వాహనాల నెంబర్ ప్లేట్లపై "టీఎస్" స్థానంలో "టీజీ" అనే అక్షరాలను తీసుకొస్తామని ఆయన గతంలోనే చెప్పారు! అయితే ఇది అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తించేలా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఈ నేపథ్యంలో... టీఎస్ ఆర్టీసీ, టీఎస్పీఎస్సీ వంటి సంస్థలు కూడా ఈ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది! ఈ కీలక మార్పు ప్రక్రియకు కేంద్రం లాంఛనంగా అనుమతి ఇవ్వడంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా... వెబ్‌ సైట్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టుల్లోనూ ఇకపై "టీజీ" అనే పదాన్నే వినియోగించాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశాలిచ్చారు.