Begin typing your search above and press return to search.

అమరావతికి ఊతం...కోనసీమ కొబ్బరికి ప్రోత్సాహం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అనేక అంశాలను పరిశీలిస్తే ఏపీకి మేలు జరిగేలా ఉందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2026 4:49 PM IST
అమరావతికి ఊతం...కోనసీమ కొబ్బరికి ప్రోత్సాహం
X

ఏపీకి కేంద్ర బడ్జెట్ లో భారీ లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అనేక అంశాలను పరిశీలిస్తే ఏపీకి మేలు జరిగేలా ఉందని చెబుతున్నారు. అమరావతి రాజధాని విషయంలో కానీ ఏపీలో కోనసీమ వంటి ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే విషయంలో కానీ అలాగే రైతులకు ఇతర వర్గాలకు కానీ ఎంతో లాభం కలుగుతుందని అంటున్నారు.

రాజధానికి నిధులు :

అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ఏడీబీ నిధులుగా ఒక వేయి 128.91 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే రాజధాని అభివృద్దికి ప్రత్యేక నిధుల కేటాయింపు చేస్తున్నారు. హైదరాబాద్ కర్నూలు అనంతపురం మీదుగా హై స్పీడ్ రైళ్ళను కేటాయించడం ఏపీకి మంచి శుభ పరిణామంగా చెబుతున్నారు. ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ కోసం అలాగే రేర్ ఎర్త్ కారిడార్ లలో ఏపీని కీలక భాగస్వామిగా ఎంపిక చేయడం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని అంటున్నారు.

కోనసీమ కొబ్బరి కోసం :

అదే విధంగా కేంద్ర బడ్జెట్ 2026-27లో దేశంలో కొబ్బరి సాగును ప్రోత్సహించడం కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో ఏపీ లాంటి తీరప్రాంతాలలో అధికంగా సాగు చేసే కొబ్బరి తోటలకు మేలు జరగనుంది. కేంద్రం తలపెట్టిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కొబ్బరి ఉత్పత్తి పెంపు జరగనుంది. అలాగే అధిక విలువ కూడా దక్కనుంది. కొబ్బరి రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం తాజా బడ్జెట్ లో ఈ నూతన పథకాన్ని తీసుకుని వచ్చింది. కొబ్బరి ఉత్పత్తిని భారీగా పెంచడంతో పాటు ప్రాసెసింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నట్టుగా ఆర్థిక మంత్రి తెలిపారు. దీని వల్ల కొబ్బరి ఎగుమతులతో పాటు ఉత్పాదకతను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు.

వీటికి సైతం :

ఇక దేశంలో కోకో, జీడిపప్పుతో పాటు కొబ్బరి సాగుకు ప్రోత్సహించనున్నట్టుగా కేంద్ర బడ్జెట్ లో స్పష్టం చేశారు. ఈ విధంగ కొబ్బరి ఉత్పత్తి చేసే రాష్ట్రాలలోని రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడానికి కేంద్రం నిర్ణయం తీసుకునిద్. సముద్ర తీర ప్రాంతాలలో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం కూడా అందిస్తారు. అలాగే జీడిపప్పు, కోకో ఉత్పత్తులను గణనీయంగా పెంచుతారు. గంధం చెట్ల వనాలతో పాటు బాదం, పైన్‌నట్స్‌ కోసం ఈ ప్రత్యేక పథకంలో ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. మరో వైపు కొబ్బరి పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచింది. దాని వల్ల మిల్లింగ్ కొబ్బరి క్వింటాలుకు 12 వేల 27 రూపాయలుగా ఉంది. అలాగే బాల్ కొబ్బరి క్వింటాలుకు 12 వేల 500 రూపాయలుగా నిర్ణయించారు. .

ప్రతీ జిల్లాకు ఒక బాలికల హాస్టల్ :

మరో వైపు చూస్తే దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ క్రమంలో రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.

సంప్రదాయ వైద్యానికి :

ఇక దేశంలో సంప్రదాయ వైద్యానికి పెద్ద పీట వేయనున్నారు. ఈ నేపధ్యంలో సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రానున్న కాలంలో దేశంలో మూడు ఆయుర్వేద ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర ఆర్ధిక మంత్రి వెల్లడించారు. ఆతిథ్యరంగంలో జాతీయ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్రం ప్రకటించడం మరో విశేషం. అదే విధంగా దేశంలోని ఇరవై దాకా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో పదివేల గైడ్‌లను నియమించనున్నట్లుగా కేంద్ర మంత్రి తెలియచేయడం మరో విశేషం.