Begin typing your search above and press return to search.

నిరుద్యోగ‌మే అస‌లు సెగ‌.. అటు రాజ‌స్థాన్‌.. ఇటు తెలంగాణ సేమ్ టు సేమ్‌!

రెండు ప్ర‌ధాన రాష్ట్రాల్లో జ‌రుగుతున్న, జ‌ర‌గ‌బోతున్న ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. నిరుద్యోగ‌మే ఆయా రాష్ట్రా ల్లో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:30 PM GMT
నిరుద్యోగ‌మే అస‌లు సెగ‌.. అటు రాజ‌స్థాన్‌.. ఇటు తెలంగాణ సేమ్ టు సేమ్‌!
X

రెండు ప్ర‌ధాన రాష్ట్రాల్లో జ‌రుగుతున్న, జ‌ర‌గ‌బోతున్న ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. నిరుద్యోగ‌మే ఆయా రాష్ట్రా ల్లో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ఇదే అక్క‌డి అధికార పార్టీల‌కు సెగ పెడుతుంద‌నే అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి. ముందుగా శ‌నివారం పోలింగ్ జ‌రుగుతున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారాన్ని తీసుకుంటే.. ఇక్క‌డ ఒకే ద‌శ‌లో 199 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ జ‌రుగుతోంది. గ‌త ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీనియ‌ర్‌నాయ‌కుడు అశోక్ గ‌హ్లాట్ సీఎంగా ఉన్నారు.

అయితే.. ఇప్పుడు మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్న అశోక్‌కు.. నిరుద్యోగ స‌మ‌స్య తీవ్ర ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఐదేళ్ల‌లో ఇచ్చిన ఉద్యోగాలు కేవ‌లం 56 వేలు. కానీ, నిరుద్యోగులు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్నారు. మొత్తం ఓటర్లు 5,25,38,105 మంది కాగా.. వీరిలో మూడో వంతు మంది 1,70,99,334 18-30 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. వీరిలోనూ 22,61,008 మంది 18-19 ఏళ్లవారు తొలి సారి ఓటు వేస్తున్నవారు ఉన్నారు. వీరంతా నిరుద్యోగుల జాబితాలో ఉన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీ ఉదంతంతో వీరంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రోడ్లపైకి ఉద్యమిస్తున్నారు జేపీ వీరికి మద్దతిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇదే అతిపెద్ద ప్రతిబంధకం కూడా.

ఇక, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. రాష్ట్రంలోని 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో అనేక మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో స్వతంత్రులుగా బ‌రిలో నిలిచిన వారు.. 252 మంది. ఒకే నియోజ‌వ‌క‌ర్గంలోముగ్గురు నుంచి నలుగురు కూడా పోటీలో ఉన్నారు. అయితే.. వీరంతా నిరుద్యోగులు, పైగా 30 ఏళ్ల‌లోపు వారే. వీరి నినాదం ఒక్కటే నియామ‌కాలు. మేం డిగ్రీ చ‌దివాం.. తెలంగాణ వ‌స్తే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని చెప్పారు. కానీ, ఇప్ప‌టికీ రాలేద‌ని వారు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే వారంతా పోటీకి రెడీ అయ్యారు. ఉదాహ‌ర‌ణ‌కు కొల్లాపూర్ నుంచి క‌ర్నే శిరీష ఉర‌ఫ్ బ‌ర్రెల క్క‌, కామారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థి మంగలిపల్లి భార్గవి పోటీలో ఉన్నారు. వీరంతా కేవ‌లం నిరుద్యోగంపై ఉన్న ఆగ్ర‌హంతోనే పోటీకి దిగ‌డం గ‌మ‌నార్హం. వీరు గెలుస్తారా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధాన స‌మ‌స్య‌ను అయితే.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తున్నారు. ఇది అధికార పార్టీకి ప్ర‌తిబంధ‌కంగా మారుతుంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు