Begin typing your search above and press return to search.

బాబు స్కిల్ స్కాం కేసులో సీబీఐ కోసం.... హైకోర్టుకు ఉండవల్లి

ఈ నేపధ్యంలో న్యూట్రల్ జనాలకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు పొందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇపుడు ఒక్క లెక్కన ఉరిమారు.

By:  Tupaki Desk   |   21 Sep 2023 5:39 PM GMT
బాబు స్కిల్ స్కాం కేసులో సీబీఐ కోసం....   హైకోర్టుకు ఉండవల్లి
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఇపుడు జైలు గోడల మధ్య ఉన్నారు. ఎంతో మందిని జైలు వరకూ రానీయకుండా బెయిల్ వచ్చేలా చూసిన బహు గొప్ప న్యాయపరుడు అయిన చంద్రబాబుకు టీడీపీకి ఆగస్ట్ గండం అనుకుంటే ఇపుడు కొత్తగా సెప్టెంబర్ గండం ఏర్పడుతోంది.

చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కేసు పెట్టి మరీ ఏపీ సీఐడీ విచారిస్తోంది. దీని మీద ఈ నెల 9న నంద్యాల లో అరెస్ట్ చేసి మరీ ఏసీబీ కోర్టులో పక్కా ఆధారాలు ఉన్నాయని వాదించింది, ఫలితంగా బాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు.

ఇక ఈ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయని ఒక వైపు వైసీపీ అంటూంటే అసలు అలాంటిది ఏదీ లేదని టీడీపీ అంటోంది. ఈ మొత్తం గొడవలో ఎవరి వాదనలు వారికి ఉండగా న్యూట్రల్ జనాలు అర్ధం కాక అలా చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో న్యూట్రల్ జనాలకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు పొందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇపుడు ఒక్క లెక్కన ఉరిమారు.

బాబుని ఇబ్బంది పెడుతున్న స్కిల్ స్కాం కేసులో సీఐడీతో కాకుండా సీబీఐ ద్వారా విచారించాలని కోరుతూ ఆయన హై కోర్టుని ఆశ్రయించారు. స్కిల్ స్కాం కేసుని సమగ్రంగా విచారించాల్సి ఉందని అందువల్ల సీబీఐ విచారణ అయితే బెటర్ అని ఆయన అంటున్నారు. పైగా ఇది హై ప్రొఫైల్ కేసు అని అనేక అంశాలతో సంక్లిష్టంగా ఉన్న కేసు కూడా అని ఆయన అంటున్నారు.

సీబీఐ విచారణ కోరుతూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐ, ఈడీ, చంద్రబాబు అచ్చెన్నాయుడు సహా 44 మందిని చేర్చడం విశేషం. ఈ పిటిషన్ కి ఇంకా నంబరింగ్ ఇవ్వలేదని అంటున్నారు.

అయితే సడెన్ గా ఉండవల్లి ఈ కేసులోకి వచ్చి సీబీఐ విచారణ అనడం అంటే మ్యాటర్ చాలానే ఉందని అంటున్నారు. అసలే న్యాయ వాదిగా పేరున్న ఉండవల్లి ఇలాంటి కేసుల విషయంలో దిట్టగా పేరు పొందారు. ఆయన ఆర్ధిక పరమైన కేసులను పట్టుకుంటే అందులో విషయం చాలా ఉన్నట్లే అంటారు. అలాంటి ఉండవల్లి ఇపుడు ఎంట్రీ కావడంతో చంద్రబాబు కేసు విషయంలో హైకోర్టు ఏమి చేయబోతోంది అన్నది ఒక చర్చగా ఉంది.

మరో వైపు చూస్తే సామాన్య జనంలో ఇప్పటిదాకా బాబు మీద ఈ కేసు పెట్టి ఇరికించారు అన్న భావన ఎంతో కొంత ఉన్నా ఉండవల్లి వంటి న్యూట్రల్ పర్సన్, విషయ పరిజ్ఞానం ఉన్నవారు ఈ కేసులోకి రావడం ద్వారా బాబు హయాంలో ఏదో జరిగింది అన్న భావన అయితే బలపడే అవకాశం ఉంది అంటున్నారు. సో సీబీఐ విచారణకు కనుక హై కోర్టు ఆదేశిస్తే బాబుకు పూర్తి కష్టాలు వచ్చినట్లే అంటున్నారు.