2029 ఎన్నికలు వైసీపీకి టఫ్ అంటున్న ఉండవల్లి
వైసీపీ అయితే ఇక తామే రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని గట్టిగా చెప్పుకుంటోంది. ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు అయితే మరో మూడేళ్ళు ఆగండి అని అపుడే స్వీట్ హాట్ వార్నింగులు ఇచ్చేస్తున్నారు.
By: Satya P | 5 April 2026 9:36 AM ISTవైసీపీ అయితే ఇక తామే రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని గట్టిగా చెప్పుకుంటోంది. ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు అయితే మరో మూడేళ్ళు ఆగండి అని అపుడే స్వీట్ హాట్ వార్నింగులు ఇచ్చేస్తున్నారు. జగన్ అయితే రెండేళ్ళు గడచిపోయాయి, కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం మూడేళ్ళలో వస్తుందని క్యాడర్ కి లీడర్ కి చెబుతున్నారు. మరి ఇంతలా ఫ్యాన్ పార్టీలో కాన్ఫిడెన్స్ కనిపిస్తున్న వేళ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన రాజకీయ విశ్లేషణ చేశారు. ఆయన ఒక యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ 2029 ఎన్నికలు వెరీ టఫ్ అని చెప్పేశారు.
కూటమిగా వస్తే కనుక :
ఏపీలో కూటమి పార్టీలు అన్నీ ఈ రోజుకు కలసి ఉన్నాయని ఆయన గుర్తు చేశాయి. పదిహేనేళ్ళ పాటు తాము అంతా కలిసే ఉంటామని వారంతా చెబుతున్నారని గుర్తు చేశారు. అయితే ఇదే నిజం అయితే మాత్రం 2029 ఎన్నికలు అంత ఈజీగా జరగవని అన్నారు. కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా టఫ్ గానే సాగుతాయని అన్నారు. అపుడు ఫలితం ఏమిటి అన్నది కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. కూటమి గట్టిగా ఉంటే వైసీపీకి ఇబ్బందికరమే అని కూడా చెప్పారు.
విడిపోతే మాత్రం :
అదే సమయంలో కూటమి పార్టీలు విడిగా పోటీ చేస్తే మాత్రం వైసీపీకి చూసుకోనక్కరలేదని వార్ వన్ సైడ్ అవుతుందని ఉండవల్లి విశ్లేషించారు. అంటే ఆయన చెప్పిన దాని బట్టి కలసి ఉంటే కూటమిని ఏనుగంత బలం వస్తుందని ఓట్లు అన్నీ సమిష్టిగా కూటమి గూట్లో పడతాయని అర్ధం చేసుకోవాల్సి ఉంది. అదే విడిపోతే ఓట్ల చీలిక వైసీపీకి మేలు చేస్తుందని అంటున్నారు. మరి ఈ విషయం కూటమి పార్టీలకు కూడా తెలుసు. పైగా రెండేళ్ళు గడచినా అంతా ఒక్కటిగా ఉంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయంలో ఒక్కటే మాట అంటున్నారు పదిహేనేళ్ళు కూటమే పాలిస్తుందని కూడా చెబుతున్నారు. సో వైసీపీకి 2029 లో అలా అయితే చాన్సెస్ తక్కువ అన్నట్లుగా ఉండవల్లి విశ్లేషణ ఉందని అంటున్నారు.
నో పాలిటిక్స్ :
ఇక ఇదే సమయంలో తనకు రాజకీయాల మీద 2009లోనే ఆసక్తి పోయిందని ఉండవల్లి చెప్పడం విశేషం. ఇంకా ఎప్పాలి అంటే వైఎస్సార్ మరణం తరువాత ఎందుకొచ్చిన రాజకీయం అనుకున్నాను అని చెప్పారు. ఇక విభజన తరువాత తాను 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని చెప్పారు. పైగా తన రాజకీయ జీవితం కూడా ముగించేద్దామని నిర్ణయించుకునే ఈ విధంగా ఉంటున్నాను అని చెప్పారు. తనకు వైఎస్సార్ తో గడిపిన కాలం ఆనాటి రాజకీయం అన్నీ మంచి జ్ఞాపకాలుగా ఆయన చెప్పుకొచ్చారు.
ఈవీఎం మీద అనుమానాలు :
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో ఈవీఎంలను మ్యానేజ్ చేశారని 12 లక్షల ఓట్లు అధికంగా నమోదు అయ్యాయని పరకాల ప్రభాకర్ వంటి వారు చెబుతున్న దాని మీద ఉండవల్లి మాట్లాడుతూ తాను పరకాల్తో ఏకీభవిస్తాను అని సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఎక్కడ ఎలా ఏమి జరిగింది అన్నది తెలియదు కానీ అనుమానాలు అయితే ఉన్నాయని వాటిని తీర్చాల్సిన ఎన్నికల సంఘం మాట్లాడకపోవడమే విచిత్రం అన్నారు. ఇక కేంద్రంలో బీజేపీ పెద్దలు ఎలా అనుకుంటే అలా అంతా జరిగి తీరుతుందని కూడా ఆయన ఏపీ రాజకీయాల మీద వ్యాఖ్యలు చేశారు. బాబు మోడీల మధ్య ఉన్నది రాజకీయ బంధమే అని ఎవరి అవసరాల కోసం వారు కలిసి ఉంటున్నారు అని ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.
