ఐక్య రాజ్య సమితి ఖజానా ఖాళీ
ఐక్య రాజ్య సమితి. ప్రపంచ దేశాలకు అత్యున్నత వేదిక. వందలాది దేశాల కోసం పుట్టిన సంస్థ. దేశాల మధ్య సామరస్యం, శాంతిని స్థాపించడమే కాకుండా ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్న విశ్వ వేదిక.
By: Satya P | 2 Feb 2026 9:21 AM ISTఐక్య రాజ్య సమితి. ప్రపంచ దేశాలకు అత్యున్నత వేదిక. వందలాది దేశాల కోసం పుట్టిన సంస్థ. దేశాల మధ్య సామరస్యం, శాంతిని స్థాపించడమే కాకుండా ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్న విశ్వ వేదిక. 1945 ముందు నాటికి ఉన్న నానా జాతి సమితి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రూపు మార్చుకుని ఐక్య రాజ్యసమితిగా ఆవిర్భవించింది. 193 సభ్య దేశాలు ఇచ్చే నిధులతో ప్రపంచ శాంతిని కాపాడటం, మానవ హక్కులను ప్రోత్సహించడం, అభివృద్ధిని పెంపొందించడం ప్రపంచ దేశాల మధ్య సహాయాన్ని సమన్వయం చేయడం లక్ష్యంగా ఐక్య రాజ్య సమితి పెట్టుకుంది. ఎనిమిది పదుల వయసులో ఉన్న ఐక్య రాజ్య సమితి ఇపుడు అతి పెద్ద ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అని అంటున్నారు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో :
ప్రపంచానికి పెద్దన్నగా ఉంటూ దేశాల మధ్య పంచాయతీలను సెటిల్ చేస్తూ గురు స్థానంలో ఉండాల్సిన ఐక్య రాజ్య సమితి తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులో ఉంది అన్నది నిజం అంటున్నారు. ఇలా ఎందుకు జరిగింది అసలు ఎందుకు ఈ స్థితి వచ్చింది అంటే చాలానే విషయం ఉందిట. తాజా నివేదికలు చెప్పిన దానిని బట్టి చూస్తే ఆర్ధిక పతనం అంచున ఇపుడు ఐక్య రాజ్య సమితి నిలుచుని ఉంది అని అంటున్నారు. జనవరి 2026 నాటి నివేదికల ప్రకారం చూతే ఐక్య రాజ్య సమితి చాలా ఆర్ధిక సవాళ్ళను ఫేస్ చేస్తోంది అని తెలుస్తోంది.
పేరుకుపోయిన బకాయిలు:
ఐక్య రాజ్య సమితికి బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుని పోయాయి అని అంటున్నారు. 2025 ముగిసే సమయానికి సభ్య దేశాల నుండి రావాల్సిన బకాయిలు చూస్తే భారతీయ కరెన్సీ లెక్కల్లో చూస్తే అక్షరాల సుమారు 13 వేల కోట్ల రూపాయలకు ఉన్నాయని చెబుతున్నారు. ఇవి రికార్డు స్థాయికి చేరుకున్న బకాయిలు అని అంటున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులే కాకుండా ఖజానా ఖాళీ అయి నిధుల కొరతతో ఐక్య రాజ్య సమితి సతమతమవుతోంది.
డేంజర్ సిగ్నల్స్ :
ఈ పేరుకుని పోయిన బకాయిలు వసూలు కాకపోతే 2026 మధ్య నాటికి ఐక్య రాజ్య సమితి ఖజానా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలియచేయడం విశేషం. ఐక్యరాజ్యసమితి చీఫ్ సభ్య దేశాలకు రాసిన లేఖ ప్రకారం ఐక్యరాజ్యసమితి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని స్పష్టం అవుతోంది. సభ్య దేశాలు తమ రుసుములను చెల్లించనందున జూలై నాటికి ఉన్న డబ్బు అయిపోవచ్చని ఆయన అన్నారు. సభ్యుల విరాళాలు ఆర్థిక వ్యవస్థ ఆధారితమైనవి ఇక ఈ విధంగా ఐక్య రాజ్య సమితికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక ఇబ్బందులు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అగ్ర దేశం అమెరికా సహా ఇతర ప్రధాన దేశాలు తమ వాటా బకాయిలను సకాలంలో చెల్లించకపోవడం అని అంటున్నారు. అంతే కాదు ఈ చెల్లింపులను ఆయా దేశాలు నిలిపివేయడం కూడా ఈ పెను ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
సిబ్బందికి జీతాలు లేవు :
ఈ ఆర్ధిక సంక్షోభం ఎంతదాకా వెళ్ళిందంటే నిధుల కొరత కారణంగా ఐక్యరాజ్యసమితి తన దగ్గర పనిచేసే సిబ్బంది జీతాలు సైతం చెల్లించలేని విధంగా ఉందని అంటున్నారు. అలాగే శాంతి పరిరక్షణ చర్యలు వాటికి సంబంధించిన కార్యకలాపాలు అమలు చేయలేకపోతోంది అనీ అంటున్నారు మరి ఏ ఇతర ముఖ్యమైన మానవీయ కార్యక్రమాలు కూడా ఐక్య రాజ్య సమితి చేయలేని విధంగా తీవ్ర ప్రభావం పడుతోంది అని అంటున్నారు. అందువల్ల ఐక్య రాజ్యసమితిలో ఉన్న సభ్య దేశాలన్నీ తమ బాధ్యతలను సకాలంలో నెరవేర్చకపోతే ప్రమాదకరమైన పరిస్థితులే ఉంటాయని అంటున్నారు. ఈ దేశాలు తమ ఆర్థిక నియమాలను మార్చుకోకపోతే ఈ దుర్భర పరిస్థితి మరింత స్పష్టంగా మారుతుందని దాంతో సంక్షోభానికే దారి తీస్తుందని ఐక్య రాజ్య సమితి అధికారులు చెబుతున్నారు.
