పాకిస్థాన్‌కు చెప్పలేక.. భారత్ కు నీతులా! : యూఎన్‌పై ఫైర్
ఐక్యరాజ్యసమితి(యూఎన్) వ్యవహారంపై ప్రపంచ దేశాలు.. ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక దేశాలు మండి పడుతు న్నాయి
By: Tupaki Desk | 25 April 2025 9:45 AMఐక్యరాజ్యసమితి(యూఎన్) వ్యవహారంపై ప్రపంచ దేశాలు.. ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక దేశాలు మండి పడుతు న్నాయి. ``అప్పుడు ఉక్రెయిన్ రష్యా విషయంలోనూ ఇలానే చేశారు`` అంటూ.. యూఎన్‌పై నిప్పులు చెరిగారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహిల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్‌ను హెచ్చరించాల్సిందిపోయి.. భారత్‌కు నీతులు చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమి తి ఏమైనా చేయాలని అనుకుంటే.. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేయాలని సూచించారు.
ఏం జరిగింది?
తాజాగా జరిగిన ఉగ్రదాడిపై యూఎన్ ప్రధాన కార్యదర్శి గుట్రెరస్ స్పందించారు. భారత్.. పాకిస్థాన్‌పై యుద్ధానికి సన్నద్ధమవుతున్న వస్తున్నవార్తలు విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో భారత్ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. పాకిస్థాన్‌పై యుద్ధం చేయడం వల్ల ఏమీ ఒరగదని.. ఇరు దేశాలూ కలిసి కూర్చుని శాంతి చర్చలు చేయాలని ఆయన సూచించారు. దీనికి ఐక్యరాజ్యసమితి కూడా.. సహకరిస్తుందన్నారు.
అయితే.. ఈ వ్యాఖ్యలపైనే భారత్‌కు మిత్రదేశాలుగా ఉన్న అమెరికా సహా.. పలు దేశాలు.. స్పందించాయి. ఐక్యరాజ్యసమితి ద్రుతరాష్ట్ర పాత్ర పోషిస్తోందని(బ్లైండ్ రోల్) వ్యాఖ్యానించాయి. ఏదైనా చేయాలని అనుకుంటే.. నిజాయితీగా చేయాలని.. పాకిస్థాన్‌ను వెనుకేసుకు వస్తున్నట్టుగా వ్యాఖ్యానించడం సరికాదని.. స్విట్జర్లాండ్ పేర్కొంది. దాదాపు అమెరికా కూడా.. ఇదే వ్యాఖ్య చేసింది.
చైనా ప్రమేయంతోనే..?
కాగా.. ఐక్యరాజ్యసమితి ఇలా వ్యాఖ్యానించడం వెనుక.. పాకిస్థాన్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టుగా కామెంట్లు చేయడం వెనుక.. చైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైకి ఎవరూ చైనా పేరును చెప్పకపోయినా.. పాకిస్థాన్‌కు... చైనాకు మధ్య ఉన్న వ్యాపార, వాణిజ్య బంధాలు.. బలంగా ఉండడం.. ఇప్పుడు భారత్ యుద్ధానికి దిగితే.. తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితిలో శాస్వత సభ్య దేశంగా ఉన్న పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసేలా డ్రాగన్ కంట్రీ వ్యవహరించి ఉంటుందని పలు దేశాలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఈ విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నట్టు మీడియా ఉటంకించడం గమనార్హం.