Begin typing your search above and press return to search.

బ్రిటీష్ యుద్ధ విమానం కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏమైంది?

విమానం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఇలాంటి పదాలు మీడియాలో కనిపిస్తుంటే చాలా మందిలో టెన్షన్ నెలకొంటుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 Jun 2025 2:38 PM IST
బ్రిటీష్  యుద్ధ విమానం కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏమైంది?
X

విమానం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఇలాంటి పదాలు మీడియాలో కనిపిస్తుంటే చాలా మందిలో టెన్షన్ నెలకొంటుందని అంటున్నారు. వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలే ఇందుకు కారణం. మొన్న అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమాన ప్రమాదంలో 274 మంది మరణించగా.. తాజాగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ సమయంలో బ్రిటిష్ యుద్ధ విమానం కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనే వార్త కలకలం రేపింది.

అవును... తాజాగా యూకేకు చెందిన ఎఫ్-35బీ రకం యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దీంతో.. అసలేమి జరిగి ఉంటుందనే ఆందోళన నెలకొంది. అయితే దీనికి గల కారణం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. హిందూ మహాసముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో.. ఆ విమానంలోని ఇంధనం తగ్గిపోవడంతో ఎమర్జెన్సీ ల్య్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.

శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో ఐదో తరానికి చెందిన ఈ స్టెల్త్‌ ఫైటర్ జెట్‌.. యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన "హెచ్‌.ఎమ్‌.ఎస్‌. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌" క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ లో భాగంగా చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోంది. ఇదే సమయంలో... ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి యుద్ధ విన్యాసాలు కూడా చేసింది.

అయితే... ఎఫ్-35బీ జెట్ రకం యుద్ధ విమానం ఈ ప్రాంతంలో ల్యాండింగ్ కావడం అరుదైన ఘటనే కానీ... అసాధారణం మాత్రం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం.. కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారుల నుంచి ఆమోదం పొందిన తర్వాత ఇంధనం నింపడం జరిగిందని తెలుస్తోంది! అయితే దీనిపై యూకే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని తెలుస్తోంది.