వరల్డ్ పవర్ ఫుల్ ఫైటర్ జెట్... రెండు రోజులుగా కేరళలో ఎందుకు?
రెండు రోజుల క్రితం యూకేకు చెందిన ఎఫ్-35బీ రకం యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 18 Jun 2025 1:00 AM ISTరెండు రోజుల క్రితం యూకేకు చెందిన ఎఫ్-35బీ రకం యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో.. అసలేమి జరిగి ఉంటుందనే ఆందోళన నెలకొంది. అయితే హిందూ మహాసముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో.. ఇంధనం తగ్గిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు కథనాలొచ్చాయి. అయితే ఆ రోజు నుంచి ఆ విమానం అక్కడే ఉండటం గమనార్హం.
అవును... ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్లలో ఒకటైన ఎఫ్-35బి యుద్ధం విమానం రెండు రోజుల క్రితం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. రెండు రోజులైనా ఆ విమానం ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయింది. అయితే... దీనికి వచ్చిన సమస్య ఇంధనం తగ్గడం అయ్యి ఉండదు.. ఏదో సాంకేతిక సమస్య వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో... ఆ సాంకేతిక సమస్యను పరిష్కరించి, సర్వీసు చేయించి.. తిరిగి హెచ్.ఎం.ఎస్. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పైకి చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫైటర్ జెట్ కు సీఐఎస్‌ఎఫ్ భద్రతను కల్పిస్తుంది. ఇది ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోంది. ఇదే సమయంలో... ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి యుద్ధ విన్యాసాలు కూడా చేసింది.
కాగా... మనదేశంలో ఓ విదేశీ యుద్ధ విమానం రెండ్రోజులపాటు నిలిచిపోవడం.. అందులోనూ ఎఫ్-35 వంటి జనరేషన్ స్టెల్త్ జెట్ మొరాయించడం సాధారణ విషయం కాదని అంటున్నారు. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్ ఫోర్స్ ల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా దీనిలోనే మరో వేరియంట్ విమానాన్ని ఇరాన్ పై దాడులకు వాడుతోంది.
