కొత్త రూల్: అత్తగారు ఇంట్లో ఉండాలన్నా కోడలి అనుమతి తప్పనిసరి!
యూఏఈ వాళ్ల పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన కొన్ని రూల్స్‌ని మార్చింది. అందులో మెయిన్‌గా పెళ్లయిన జంట ఇంట్లో ఎవరు ఉండొచ్చు అనే దాని గురించి ఒక రూల్ ఉంది.
By: Tupaki Desk | 18 April 2025 6:00 AM ISTఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఒక అత్త, అల్లుడు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం దేశమంతా హాట్ టాపిక్‌గా మారింది. అత్తాకోడళ్ల మధ్య గొడవలు కామన్, కానీ ఇక్కడ ఏకంగా అత్త, కూతురు, అల్లుడు కలిసి ఒక లవ్ ట్రయాంగిల్‌లో చిక్కుకున్నారు. ఇదిలా ఉండగా మనకు మంచి ఫ్రెండ్‌గా ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో కూడా అత్తాకోడళ్లు, ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది.
రూల్స్‌లో మార్పులు
యూఏఈ వాళ్ల పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన కొన్ని రూల్స్‌ని మార్చింది. అందులో మెయిన్‌గా పెళ్లయిన జంట ఇంట్లో ఎవరు ఉండొచ్చు అనే దాని గురించి ఒక రూల్ ఉంది. ఇండియాలో అయితే చాలామంది అబ్బాయిలు పెళ్లయినా తల్లిదండ్రులతోనే ఉంటారు. కొడుకు, కోడలు ఒకే ఇంట్లో ఉంటే అబ్బాయి పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారు. కానీ అమ్మాయిల తరపున వాళ్ల అమ్మలు మాత్రం కూతురు, అల్లుడు వేరే కాపురం పెట్టాలని, అత్తమామలు, ఆడపడుచులు లేని ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ఇది మన ఇండియన్ సొసైటీలో చాలా కామన్ విషయం. ఇదే విషయాన్ని యూఏఈలో ఇప్పుడు మార్చేశారు.
పర్మిషన్ తీసుకోవాల్సిందే:
ఏప్రిల్ 15 నుంచి కొత్తగా వచ్చిన పర్సనల్ స్టేటస్ లా ప్రకారం, భార్యాభర్తలు ఉండే ఇంట్లో భర్త పేరెంట్స్ ఉండాలంటే భార్య పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఒక అమ్మాయి తన అత్త, మామగారు వాళ్లతో కలిసి ఉండకూడదు అనుకుంటే, చట్ట ప్రకారం ఆమె అలా చెప్పేయొచ్చు. ఇకపై అత్తగారు కూడా తన కొడుకు, కోడలు ఉండే ఇంట్లో ఉండాలంటే కోడలి దగ్గర అనుమతి తీసుకోవాల్సిందే అన్నమాట!
