Begin typing your search above and press return to search.

లేడీ ఎన్నారై లవ్‌ స్టోరీ వైరల్... "హౌ ఇట్ బిగిన్డ్ వర్సెస్ హౌ ఇట్స్ గోయింగ్"!

అవును... భారతీయ సంతతి కి చెందిన ఆస్ట్రో ఫిజిసిస్ట్ సంజనా కర్టిస్.. సైన్స్ జర్నలిస్ట్‌ అయిన తన భాగస్వామి డారెన్ ఇంకోర్వాయా ను ట్విటర్ లో కలుసుకున్నారు

By:  Tupaki Desk   |   24 Oct 2023 4:30 PM GMT
లేడీ ఎన్నారై లవ్‌ స్టోరీ వైరల్... హౌ ఇట్ బిగిన్డ్ వర్సెస్ హౌ ఇట్స్ గోయింగ్!
X

రేమ ఎప్పుడు ఎలా ఎవరికి ఎవరిపై పుడుతుందనేది ఎవరూ చెప్పలేరని అంటుంటారు. ఆ సమయంలో రెండు మనసుల మధ్య ఆకర్షణతో, ఆత్మీయతతో, భావోధ్వేగంతో కూడిన తరంగాల ప్రసరణ మాత్రమే ఉంటుందని.. అది జీరో డెసిబల్స్ శబ్ధంతో హృదయాలకు మాత్రమే వినిపిస్తుందని అంటారు. అయితే... ప్రేమకూ ఆకర్షణకూ మధ్య తేడా తెలియని బంధాలు అర్ధాంతరంగా ముగిసిపోతే.. తెలిసిన బంధాలు మాత్రం తెగకుండా ఉంటాయి!

ఇలాంటి ప్రేమకథను కలిగిన లేడీ ఎన్నారై లవ్‌ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది. అగ్రరాజ్యం అమెరికాలో ఉండే లేడీ ఎన్నారై లవ్‌ స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక సైన్స్ కథనం విషయంలో... సైన్స్ నిపుణురాలైన ఆమెకు, జర్నలిస్ట్ అయిన అతడికి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడం, పెళ్లి వరకు వెళ్లడం జరిగింది! ఈ విషయాన్ని ఆమె నెట్టింట పెట్టడంతో అది వైరల్ అవుతోంది.

అవును... భారతీయ సంతతి కి చెందిన ఆస్ట్రో ఫిజిసిస్ట్ సంజనా కర్టిస్.. సైన్స్ జర్నలిస్ట్‌ అయిన తన భాగస్వామి డారెన్ ఇంకోర్వాయా ను ట్విటర్ లో కలుసుకున్నారు. ఈ సమయంలో సంజన ఇదే ప్లాట్‌ ఫాం పై వారి అద్భుతమైన "ఆన్‌ లైన్ ప్రేమ కథ" ను పంచుకున్నారు. ఆ లవ్‌ స్టోరీయే ఇప్పుడు నెట్టింట తెగ హల్‌ చల్ చేస్తోంది. "హౌ ఇట్ బిగిన్డ్ వర్సెస్ హౌ ఇట్స్ గోయింగ్" అనే పాపులర్ ఆన్‌ లైన్ ట్రెండ్ ఈ వివరాలు వెల్లడిస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... 2021వ సంవత్సరంలో డారెన్ ఇంకోర్వాయా.. తాను రాస్తున్న కథనంపై నిపుణుల సలహా కోసం సంజనను సంప్రదించారు. అదే వీరి ప్రేమకథకు ఓపెనింగ్ షాట్! వ్యర్థాల నిర్వహణకు పరిష్కారంగా చెత్తను అంతరిక్షంలోకి పంపే అవకాశం గురించింది ఆ కథనం. ఈ సమయంలో ఈ సైన్స్ కథనంపై అతడికి ఆమె పాఠాలు నేర్పించారు. దీంతో... వారి మధ్య పరిచయం కాస్తా స్నేహంగా మారింది.

ఈ క్రమంలో ఈ ఆన్ లైన్ పరిచయం అలా నడుస్తున్న నేపథ్యంలో... ఒకానొక సమయమంలో చికాగోలో వ్యక్తిగతంగా కలిశారు. ఈ సమయంలో ఒక అడుగు ముందుకు వేసిన డారెన్.. సంజనను "కాఫీ డేట్" కోసం అడిగాడు. దానికి ఆమె పచ్చజెండా ఊపడంతో మధ్య లవ్ జర్నీ మొదలైంది. అలా నడుస్తున్న ఈ ప్రేమకథకు సంబంధించిన ఛాటింగ్ స్క్రీన్‌ షాట్‌ తో పాటు సంజన ఆ ఫొటోను షేర్ చేశారు.

ఈ పోస్ట్‌ కి ఆమె "హౌ ఇట్ బిగిన్డ్ వర్సెస్ హౌ ఇట్స్ గోయింగ్" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆమె పెట్టిన పోస్టుకు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... ఇది అద్భుతమైన విజయం అని ఒకరంటే.. సూటిగా.. సుత్తిలేకుండా ఉంది అని మరొకరు, పరిపూర్ణమైన ప్రేమ కథ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ సమయంలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది!