టీటీడీకి ఇలా చేయడం పెద్దపనా?!
బీసీవై పార్టీ నాయకుడు బోడే రామచంద్రయాదవ్.. గత ఏడాదే కీలక ప్రకటన చేశారు. తాను లక్ష గోవులను విరాళంగా ఇస్తానని.. మరింత మందితో ఉచితంగా ఇప్పిస్తానని కూడా చెప్పారు.
By: Garuda Media | 7 Feb 2026 6:00 PM ISTతిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేరు దేశవ్యాప్తంగా సుపరిచితమే అయినప్పటికీ.. ఇప్పుడు మరిం త జోరుగా వినిపిస్తోంది. దీనికి కారణం.. కల్తీ లడ్డూ!. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యిని వినియోగించారని కూటమి పార్టీల నాయకులు, కాదు.. అసలు బోలే బాబా వంటి సంస్థకు అనుమతి ఇచ్చిందే.. 2018లో అప్పటి చంద్రబాబు అంటూ.. వైసీపీ నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. మరోవైపు సీబీఐ సిట్ నివేదికలు కూడా వివాదానికి దారి తీశాయి.
ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన కారణం.. తిరుమలకు అవసరమైన నెయ్యి విషయంలో ఆలయ అధికా రులు ఇతర సంస్థలపై ఆధారపడడమే!. అలా ఆధార పడిన నేపథ్యంలోనే పలు కంపెనీలు సరఫరా చేసే నెయ్యిని తనిఖీ చేసుకోవడం.. తిప్పిపంపడం.. వంటివాటికి కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. అంటే.. నెయ్యిని కొనుగోలు చేసేందుకు సొమ్ము.. దాని నాణ్యతను పరిశీలించేందుకు సొమ్ము వెచ్చిస్తు న్నారు. అలా కాకుండా.. టీటీడీనే సొంతగా నెయ్యి ఎందుకు తయారు చేయకూడదు? అనేది ప్రశ్న.
బీసీవై పార్టీ నాయకుడు బోడే రామచంద్రయాదవ్.. గత ఏడాదే కీలక ప్రకటన చేశారు. తాను లక్ష గోవులను విరాళంగా ఇస్తానని.. మరింత మందితో ఉచితంగా ఇప్పిస్తానని కూడా చెప్పారు. ఒక్క బోడే మాత్రమే కాదు.. టీటీడీ కనుక రంగంలోకి దిగితే.. గోసేవ చేసేందుకు.. అనేక మంది రెడీ అవుతారు. తద్వారా సొంతంగా ఆవులను పెంచి.. వాటి ద్వారా వచ్చే పాలు, పెరుగును ఎలానూ భక్తులకు నిత్యం క్యూలైన్లలో ఇచ్చే పదార్ధాలుగా వినియోగించుకోవచ్చు.
ఇక, వెన్నను స్వామి వారికి ప్రసాదంగా నివేదించవచ్చు. అదేవిధంగా నెయ్యి విషయంలో ఎలాంటి ఎలాం టి అనుమానాలకు తావులేకుండా వ్యవహరించవచ్చు. నిత్యం లక్షల మందికి అన్న ప్రసాదాలు అందిస్తున్న టీటీడీ... బర్డ్ సంస్థ ద్వారా వేలాది మంది రోగులకు సేవలు అందిస్తున్న టీటీడీ.. ఈ చిన్న పనిని చేయలేదా? అనేది ప్రశ్న. అవసరమైతే.. 100 మంది సిబ్బందిని నియమించుకునైనా.. భారీ గోశాలను నిర్మించవచ్చు. దీనికి విరాళాలు ఇచ్చేందుకు సేవ చేసేందుకు కూడా భక్తులు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ దిశగా ఆలోచన చేస్తే.. వ చ్చే రెండేళ్లలోనే స్వామివారికి సొంత నెయ్యి అందుతుంది.
