Begin typing your search above and press return to search.

గొర్రెల పథకం స్కాంలో నలుగురు అరెస్ట్...తెరపైకి షాకింగ్ విషయాలు!

కాగా... గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విస్తుపోయే నిజాలను కాగ్ ఇటీవల బయటపెట్టిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Feb 2024 1:25 PM GMT
గొర్రెల పథకం స్కాంలో నలుగురు అరెస్ట్...తెరపైకి షాకింగ్ విషయాలు!
X

తెలంగాణలో గత బీఆరెస్స్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగాయంటూ కాగ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గొర్రెల తరలింపు దగ్గరనుంచి పంపిణీ వరకూ ప్రతీ అంశంలోనూ అవినీతి జరిగిందంటూ పెద్ద చర్చ మొదలైంది. మరోపక్క అసలు కొన్ని సందర్భాల్లో గొర్రెలను కొనకుండానే కొన్నట్లు అధికారులు చూపించినట్లు తేల్చిందని అంటున్నారు. ఈ సమయంలో రంగంలోకి దిగిన ఏసీబీ నలుగురు అధికారులను అరెస్ట్ చేసింది!

అవును... గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై కాగ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టిన నేపథ్యలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన నలుగురు అధికారులను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. వీరిలో అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు నలుగురు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని అరెస్టులు జరగొచ్చా అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇప్పటికి అరెస్ట్ అయిన నలుగురు అధికారులు... ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాళ్లోకి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు మల్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారని తెలుస్తుంది. దీంతో... ఈ వ్యవహారానికి సంబంధించి అవినీతి శాఖ అధికారులు తవ్వే కొద్దీ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా నకిలీ రవాణా ఇన్వాయ్యిస్ లు, నకిలీ ట్యాగ్ లు, మరణించినవారికి సైతం గొర్రెలు పంపిణీ చేసినట్లు చూపించడాలు జరిగాయని అంటున్నారు.

కాగా... గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విస్తుపోయే నిజాలను కాగ్ ఇటీవల బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ట్రాలీతో ఉన్న వాహనంలో తరలించాల్సిన గొర్రెలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కారు, బస్సు, అంబులెన్స్‌ లలో సైతం తీసుకువచ్చినట్లు చూపించారని వెల్లడించింది! ఇదే సమయంలో గొర్రెలను కొనకుండానే కొన్నట్లు లెక్కలు చూపడంతోపాటు, చనిపోయిన వారికీ గొర్రెలను పంపిణీ చేసినట్లు కాగ్ గుర్తించింది!

ఇదే సమయంలో ప్రధానంగా నకిలీ రవాణా ఇన్వాయిస్‌ లతో సుమారు రూ.68 కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించిన కాగ్... గొర్రెలను కొనకుండానే కొన్నట్లుతో పాటు తరలించకుండానే తరలించినట్లుగా ఏదో ఒక వాహనం నెంబరు వేసి అదే వాహనంలో తరలించినట్లు కాగితాలు సృష్టించి వందల కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు కాగ్ తన నివేధికలో పేర్కొంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఏసీబీ తాజాగా నలుగురు అధికారులను అరెస్ట్ చేసింది!