Begin typing your search above and press return to search.

కొత్త ఛైర్మన్ ఎవరో ?

రాజీనామాలు ఆమోదం పొందగానే తర్వాత బోర్డు ఎప్పుడు వేస్తారు ? ఛైర్మన్ ఎవరనే విషయమై అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   12 Jan 2024 7:58 AM GMT
కొత్త ఛైర్మన్ ఎవరో ?
X

టీఎస్పీఎస్పీ ఛైర్మన్, కొందరు బోర్డు సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఛైర్మన్ కాకుండా పదిమంది సభ్యుల బోర్డులో ఇప్పటికి ఎనిమిది మంది రాజీనామాలు చేసి చాలా కాలమైంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కారణంగా వాటిని ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్ లో ఉంచారు. మరో ఇద్దరు సభ్యులు అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ మాత్రం ఇప్పటివరకు రాజీనామాలు చేయలేదు. తాజాగా రేవంత్ ఆపీసు నుండి అందిన సమాచారం ప్రకారం గవర్నర్ రాజీనామాలను ఆమోదించారు.

రాజీనామాలు ఆమోదం పొందగానే తర్వాత బోర్డు ఎప్పుడు వేస్తారు ? ఛైర్మన్ ఎవరనే విషయమై అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే కొత్తగా రాబోయే బోర్డుకు చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టే. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీ విషయమై చాలా హామీలిచ్చింది. ఆ హామీల ప్రకారం వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి అనేక ఉద్యోగాలను భర్తీ చేయాల్సుంటుంది. అలాగే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా తీసుకోవాల్సుంటంది.

ఈ ఉద్యోగాలన్నీ భర్తీ కావాలంటే ముందుగా టీఎస్పీఎస్సీ బోర్డుండాలి. కేసీయార్ పాలనలో ఈ బోర్డు గబ్బుపట్టిపోయిందనే ఆరోపణలకు కొదవేలేదు. ఒక్క నోటిఫికేషన్ను కూడా సక్రమంగా అమలుచేయలేకపోయింది. ఉద్యోగాల భర్తీకి ఎప్పుడు నోటిపికేషన్లు ఇచ్చినా పరీక్షల పేపర్లు లీకవ్వటం, గోల జరగటం, కోర్టుల్లో కేసులు పడటం, రద్దవ్వటం లాంటి కంపుతోనే సరిపోయింది. లక్షలాది మంది నిరుద్యోగులు, వాళ్ళకుటుంబాలు కేసీయార్ ప్రభుత్వం మీద మండిపోవటానికి ఇదే ప్రధాన కారణం.

సో, అప్పటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ ప్రభుత్వం ఛైర్మన్, బోర్డు సభ్యులను జాగ్రత్తగా ఎంపికచేయాలని అనుకుంటోంది. ఛైర్మన్ గా ప్రొఫెసర్ ను ఎవరినైనా నియమిస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు అర్హత కలిగిన ప్రొఫెసర్ల జాబితాను రెడీ చేయమని తన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కులాల ఆధారంగా కాకుండా, రాజకీయ నియామకాలు చేసినట్లుగా కాకుండా బాధ్యతగా మెలిగే వాళ్ళని నియమించాలని ప్రభుత్వం అనుకుంటోంది. లేకపోతే లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నట్లవుతుంది.