Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికలపై 24 సర్వేలు.. ఆంధ్రా ఆక్టోపస్ ఎక్కడున్నారు..?

అత్యంత హోరాహోరీగా.. బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేనంతగా జరిగాయి తెలంగాణ ఎన్నికలు.

By:  Tupaki Desk   |   1 Dec 2023 11:27 AM GMT
తెలంగాణ ఎన్నికలపై 24 సర్వేలు.. ఆంధ్రా ఆక్టోపస్ ఎక్కడున్నారు..?
X

అత్యంత హోరాహోరీగా.. బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేనంతగా జరిగాయి తెలంగాణ ఎన్నికలు. తెలంగాణ ఏర్పాటు ఖాయమైన 2014లో, ఏర్పడిన తర్వాత నాలుగున్నరేళ్లకు జరిగిన 2018 ఎన్నికల్లోనూ ఇప్పుడున్న పార్టీలే తలపడినా అప్పటి వాతావరణం, సమీకరణాలు వేరు. ఇప్పటి రాజకీయాలు, సమీకరణాలు వేరు. 2014లో తెలంగాణ ఇచ్చినందున కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని భావించారు. 2018లో టీడీపీ, వామపక్షాలతో కలిసి మహా కూటమి కట్టినందున అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. కానీ, ఈ రెండు సందర్భాల్లోనూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) దెబ్బకొట్టింది. కానీ,ఇప్పుడు టీడీపీ రంగంలో లేదు. బీజేపీ ఏడాది కిందటి వరకు దూకుడు చూపినా తీరా ఎన్నికల సమయానికి వెనుకబడి పోయింది.

ముఖాముఖినే.. పై‘‘చేయే’’

తొమ్మిదిన్నరేళ్లలో అద్భుత ప్రగతి సాధించామని బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చినందున ఒక్క చాన్స్ ఇవ్వమని కాంగ్రెస్.. తాజాగా జరిగిన ఎన్నికల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. బీజేపీ మాత్రం వెనుకబడిపోయింది. ఆ పార్టీకి చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయని అంటున్నారు. కానీ, ‘‘తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నాం’’ అని వారు చెప్పినదానికి అది పూర్తి భిన్నం కదా. ఇక ముఖాముఖిలో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దే పైచేయి అని స్పష్టంగా తెలుస్తోంది.

పదేళ్ల పాలనపై వ్యతిరేకత.. వెంటాడిన పొరపాట్లు

పదేళ్ల పాలనతో వచ్చిన వ్యతిరేకత, పాలనాపరంగా చేసిన లోపాలతో బీఆర్ఎస్ తాజా ఎన్నికల్లో ఎదురీదింది. అయితే, ఇప్పటికే ఓటమిపాలైనట్లు అంచనాకు రాలేము. కానీ, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ మాత్రం బీఆర్ఎస్ వెనుకబడింది అనే చెబుతున్నాయి. తెలంగాణ ఎన్నికలపై నిర్వహించిన మొత్తం 24 సర్వేల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినవి నాలుగు కావడమే దీనికి నిదర్శనం. మిగతా 20 సర్వేలూ కాంగ్రెస్ కే జై కొట్టాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ హ్యట్రిక్ చేజారిందనే వాదన వినిపిస్తోంది.

సర్వేలు సరే.. కచ్చితత్వంలో మేటి అయిన ఆయనేరి..?

తెలంగాణ ఎన్నికల పై వెలువడిన అనేక సర్వేలను పక్కనపెడితే.. ఒక వ్యక్తి మాత్రం తన సర్వే వివరాలను వెల్లడించకపోవడం చర్చనీయాంశమైంది. ఆయనే ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. 2004, 2009 ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన.. ఉమ్మడి ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయాలను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు లగడపాటి 2014 ఎన్నికలల్లో ఎవరు విజయం సాధిస్తారో కచ్చితంగా అంచనా వేసి చెప్పారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన సర్వే తెలంగాణ లో కొంత వరకు నిజమైంది. కానీ ఆంధ్ర విషయానికి వస్తే ఎంతో మంది బెట్టింగ్ రాయుళ్లు దెబ్బ అదుర్స్ అంటూ గాయబ్ అయ్యిపోయారు అని అంటారు , ప్రస్తుత ఎన్నికలకు వచ్చేసరికి లగడపాటి జాడ లేకుండా పోయింది. ఆయన సర్వే వివరాలు ఇవీ అటూ.. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎక్కడా బయటకు రాలేదు.

ఇంతకూ ఎక్కుడున్నారు..?

క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొన్న లగడపాటి ప్రస్తుతం ఎక్కడున్నారు..? అనేది కూడా తెలియరాలేదు. ప్రైవేటు కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు. గతంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయ. ఇప్పుడు అవి కూడా