Begin typing your search above and press return to search.

నన్ను పెళ్లాడతావా నిక్కీ.. ట్రంప్ మద్దతుదారు వెకిలి చేష్ట

తాజాగా ఆమె న్యూ హాంప్ షైర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ట్రంప్ మద్దతుదారు ఆమెకు పెళ్లి ప్రపోజల్ చేవారు

By:  Tupaki Desk   |   24 Jan 2024 5:15 AM GMT
నన్ను పెళ్లాడతావా నిక్కీ.. ట్రంప్ మద్దతుదారు వెకిలి చేష్ట
X

హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచార వేళ.. ఒక వ్యక్తి నుంచి అనూహ్యంగా వచ్చిన ప్రశ్నకు ఇబ్బందికి గురయ్యారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్న నిక్కీ హేలీ. అధ్యక్ష బరిలో నిలిచేందుకు ఫైట్ చేస్తున్న ట్రంప్ కు పోటీదారుగా ఉన్న ఆమె తాజాగా ఒక ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగిస్తునానరు. ఇండో అమెరికన్ అయిన నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని బలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆమె న్యూ హాంప్ షైర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ట్రంప్ మద్దతుదారు ఆమెకు పెళ్లి ప్రపోజల్ చేవారు. 'నన్ను పెళ్లి చేసుకుంటారా?' అంటూ గుంపులో నుంచి ఒకరు బిగ్గరగా ఆరిచారు. దీంతో.. అక్కడ నవ్వులు విరబూసాయి. అనుకోని రీతిలో ఎదురైన పరిణామంతో షాక్ తిన్న ఆమె.. కాస్త సర్దుకొన్న ఆమె.. అతడి మాటల్ని లైట్ తీసుకుంటూ.. తనకు మద్దతుగా ఓటు వేస్తావా? అని ప్రశ్నించారు. అందుకు అతడు బదులిస్తూ.. తాను ట్రంప్ నకు ఓటు వేయబోతున్నట్లుగా సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో అతడి వెకిలితనం నిక్కీ హేలీకి తీవ్రమైన ఆగ్రహానికి గురి చేసింది.

వెంటనే ఆమె.. అయితే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచారు. దీంతో.. అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ఆమె యథావిధిగా తన ఎన్నికల ప్రసంగాన్ని కొనసాగించారు. 52 ఏళ్ల నిక్కీ హేలీ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేసులో ముందున్నారు. ఇటీవల జరిగిన అయోవా రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ నకు 51 శాతం ఓట్లు రాగా.. నిక్కీ హేలీకి 19 వాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో అభ్యర్థిగా బరిలో ఉన్న డిశాంటిస్ కు 21 శాతం ఓట్లు వచ్చాయి. మరో భారత మూలాలున్న వివేక్ రామస్వామికి 7.7 శాతం ఓట్లు రావటంతో ఆయన అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ నకు.. నిక్కీ హేలీకి మధ్యనే హోరాహోరీ పోరు జరగనుంది. భారత సంతతికి చెందిన దంపతులు 1960లో అమెరికాకు వచ్చి స్థిరపడగా.. వారికి నిక్కీ హేలీ 1972లో జన్మించారు. 1996లో విలియం మైఖేల్ ను ఆమె వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు. సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్ గా గతంలో రెండుసార్లు వ్యవహరించిన నిక్కీ హేలీ వైవాహిక జీవితం ఎలాంటి ఆవాంతరాలు లేకుండా సాగుతున్నా.. బహిరంగ పెళ్లి ప్రపోజల్ తేవటం వెకిలితనంతో కూడుకున్నదిగా చెబుతున్నారు. ఆమెను చిరాకు పెట్టేందుకే ఆ వ్యక్తి అలాంటి తీరును ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది.