Begin typing your search above and press return to search.

తన అరెస్ట్ డేట్ చెప్పిన ట్రంప్... భారత్ పై రివేంజ్ ఫిక్స్ అంట!

అవును... తాజాగా జార్జియాలో ఎదుర్కొంటున్న "ఎన్నికల ఫలితాల్లో జోక్యం" ఆరోపణలపై ట్రంప్ కోర్టులో లొంగిపోవాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Aug 2023 11:55 AM GMT
తన అరెస్ట్  డేట్  చెప్పిన ట్రంప్... భారత్  పై రివేంజ్  ఫిక్స్  అంట!
X

అత్యంత వివాదాస్పదుడైన అమెరికా అధక్షుడిగా పేరు సంపాదించుకున్నారనే పేరు సంపాదించుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ను ప్రస్తుతం కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే లోంగిపోవాలంటూ ఆయనకు ఆదేశాలు జారీ అయ్యాయి! ఈ సమయంలో తన అరెస్టుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా జార్జియాలో ఎదుర్కొంటున్న "ఎన్నికల ఫలితాల్లో జోక్యం" ఆరోపణలపై ట్రంప్ కోర్టులో లొంగిపోవాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ట్రంప్‌ ఎదుర్కొంటున్న నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇది ఒకటి. గత కేసుల్లో కూడా ఆయన బెయిల్‌ పొందారు. ఇప్పటికే ట్రంప్‌ పై చట్టపరంగా భారీగా ఆంక్షలున్నాయి.

అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయన స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోవాలని... అనంతరం రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ ను సమర్పించి బెయిల్‌ తీసుకోవచ్చని అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ అనుమతించారు. ఈ బెయిల్‌ పొందాక సాక్షులను ప్రభావితం చేయనంతవరకు స్వేచ్ఛగా ఉండవచ్చని ట్రంప్ కు తెలిపారు.

ఈ సమయంలో ఈ విషయాలపై ట్రంప్ స్పందించారు. "నేను జార్జియాలోని అట్లాంటాకు గురువారం వెళతాను. అక్కడ రాడికల్‌ వామపక్ష డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ నన్ను అరెస్టు చేస్తారు" అని ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ట్రూత్‌ లో వెల్లడించారు.

అయితే తనపై నమోదైన కేసులు, ఆరోపణలపై ట్రంప్ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని అంటున్నారు. పూర్తిగా రాజకీయ దురుద్దేశపూర్వకంగానే వీటిని చేపట్టినట్లు ఆయన చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రిపబ్లికన్‌ ఓటర్ల మనోగతం తెలిపే వివిధ సర్వేలలో ట్రంప్‌ అందరికన్నా ముందున్నట్లు తేలింది. ఆ తర్వాతి స్థానంలో వివేక్‌ రామస్వామి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

భారత్ పై రివేంజ్ పన్ను:

ఆ సంగతి అలా ఉంటే... భారత్‌ లో కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌ లు అధికంగా ఉన్నాయంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అధ్యక్ష పగ్గాలు మళ్లీ చేపడితే భారత్‌ పై ప్రతీకార పన్ను విధిస్తాననని పేర్కొన్నారు. తాజాగా ఫాక్స్‌ బిజినెస్‌ న్యూస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు!

ఇందులో భాగంగా... భారత్‌ లో ట్యాక్సులు మరీ ఎక్కువ అని చెప్పిన ట్రంప్... అమెరికా ఉత్పత్తులపై భారత్‌ భారీగా పన్నులు వేస్తోంది. మనం మాత్రం వారి ఉత్పత్తులకు ఎలాంటి పన్నులు విధించకూడదంటోంది.. అది సరికాదు అని అన్నారు. అనంతరం "2024 అధ్యక్ష ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే భారత్‌ పై పరస్పర సమానమైన ప్రతీకార పన్ను విధిస్తా"అని ట్రంప్ హెచ్చరించారు.