Begin typing your search above and press return to search.

ట్రంప్ నోటి దూల‌.. 700 కోట్ల జ‌రిమానా!

న్యూయార్క్‌లోని మాన్‌హ‌ట‌న్ ఫెడ‌ర‌ల్ కోర్టు ట్రంప్‌కు భారీ జ‌రిమానా విధించింది. ఏకంగా 700 కోట్ల రూపాయాలు(8 ల‌క్ష‌ల 33 వేల అమెరిక‌న్ డాల‌ర్లు) చెల్లించాల‌ని త‌న తీర్పులో పేర్కొంది.

By:  Tupaki Desk   |   27 Jan 2024 1:30 PM GMT
ట్రంప్ నోటి దూల‌.. 700 కోట్ల జ‌రిమానా!
X

నోరు మంచిదైతే ఊరు మంచి ద‌వుతుంద‌ని సామెత‌. నోరు అదుపులో పెట్టుకోక‌పోతే.. ఎలాంటి ప‌రిస్తితి ఏర్ప‌డుతుంద‌నేది అమెరికా మాజీ అధ్య‌క్షుడు.. ప్ర‌స్తుతం అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న డొనాల్డ్ ట్ర‌ప్ ను చూస్తే అర్ధ‌మ‌వుతుంది. నోరుంది క‌దా.. అని మాట‌ల మాంత్రికుడిని క‌దా.. అంటూ.. ట్రంప్ త‌ర‌చుగా విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. అన్ని స‌మ‌యాల్లోనూ ఈ నోటి వాటం ప‌నిచేయ‌దు. పైగా పెద్ద చిక్కులే తీసుకువ‌స్తుంది.

ఇప్పుడు ట్రంప్ ప‌రిస్థితి ఏంటంటే..

న్యూయార్క్‌లోని మాన్‌హ‌ట‌న్ ఫెడ‌ర‌ల్ కోర్టు ట్రంప్‌కు భారీ జ‌రిమానా విధించింది. ఏకంగా 700 కోట్ల రూపాయాలు(8 ల‌క్ష‌ల 33 వేల అమెరిక‌న్ డాల‌ర్లు) చెల్లించాల‌ని త‌న తీర్పులో పేర్కొంది. ట్రంప్‌కు సంబంధించిన ఓ కేసును విచారించిన కోర్టు ఈ మేర‌కు భారీ మొత్తంలో జ‌రిమానా చెల్లించాల‌ని ఆదేశించింది. అయితే.. కేసు కోర్టుమెట్లు ఎక్క‌డం వెనుక పూర్తిగా ట్రంప్ నోటి దూలే ఉంద‌ని తెలుస్తోంది.

ఏం జ‌రిగింది..?

అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌(ప‌త్రిక‌ల‌కు వ్యాసాలు రాసే ర‌చ‌యిత‌) జీన్‌ కరోల్‌.. ట్రంప్‌పై కేసు పెట్టారు. 1996లో మాన్‌హ‌ట‌న్‌లో తాను ఓ డిపార్టెమెంట్ స్టోర్ ఉన్న‌ప్పుడు.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార వేత్త అయిన‌.. ట్రంప్ అక్క‌డ‌కు వ‌చ్చార‌ని.. ఈ స‌మ‌యంలో మాట‌లు క‌లిపి.. త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డార‌ని క‌రోల్ పేర్కొన్నారు. అయితే.. ఆమె ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి ఫిర్యాదు చేయ‌లేదు. కానీ, ఆమె ర‌చ‌యిత క‌నుక‌.. ఓ పుస్తకంలో ట్రంప్ త‌నపై చేసిన దాడి ఘ‌ట‌న‌ను వెల్ల‌డించింది. ఇది కాస్తా.. న్యూయార్క్ ప‌త్రిక‌లో 2019లో ప్ర‌చురిత‌మైంది.

అయితే.. ఇది అప్ప‌ట్లో రాజ‌కీయంగా దుమారం రేప‌డంతో ట్రంప్ రియాక్ట్ అయి.. ర‌చ‌యిత జీన్ క‌రోల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఊర‌మాస్ లెవిల్లో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జీన్‌ కరోల్‌ను ట్రంప్‌ లైంగికంగా వేధించారని గతేడాది మే నెలలో కోర్టు నిర్ధారించింది. అందుకుగాను ఆమెకు 5 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే.. క‌థ ఇక్క‌డితో అయిపోయి ఉంటే.. ట్రంప్ సేవ్ అయ్యేవారు.

కానీ, అనూహ్యంగా ఆయ‌న ఈ కోర్టు తీర్పు వ‌చ్చిన త‌ర్వాత కూడా ర‌చ‌యిత‌పై విరుచుకుప‌డ్డారు. "త‌న‌కు పాపులారిటీ రావాలి. అప్పుడే త‌ను రాసే పుస్త‌కాలు అమ్ముడ‌వుతాయి. అందుకే. నా పేరు వాడుకుంటోంది" అని వ్యాఖ్యానించారు. అంతే.. ఈ వ్యాఖ్య‌ల‌పైనా ఆమె రెండోసారి మాన్‌హ‌ట‌న్ కోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా.. మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రంప్‌ ఆమెకు 83.3 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఫ‌లితంగా కీల‌క‌మైన ఎన్నిక‌ల ముందు.. ట్రంప్‌కు భారీ ఎదురు దెబ్బ‌తగిలిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.