Begin typing your search above and press return to search.

హార్వర్డ్ వర్సెస్ ట్రంప్... "ఎక్స్ ట్రా వెట్టింగ్" తప్పదంట!

కొత్తగా హార్వర్డ్ లో చేరాలనుకునే విద్యార్థులే కాకుండా ఇప్పటికే అందులో చదువుతున్నవారు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, గెస్ట్ స్పీకర్లు మొదలైనవారు హార్వర్డ్ కు బయలుదేరనున్న సంగతి తెలిసిందే!

By:  Tupaki Desk   |   1 Jun 2025 8:45 AM IST
హార్వర్డ్  వర్సెస్  ట్రంప్... ఎక్స్  ట్రా వెట్టింగ్  తప్పదంట!
X

ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో వేల మంది అంతర్జాతీయ విద్యార్థుల ఫ్యూచర్ ను ప్రభావితం చేసేలా.. 'ట్రంప్ వర్సెస్ హార్వర్డ్’ అనే ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు కదులుతున్నారు. ఈ సమయంలో.. ఇప్పటికే వైరల్ అయిన "సోషల్ మీడియా వెట్టింగ్".. "ఎక్స్ ట్రా వెట్టింగ్" గా మారనుందని అంటున్నారు.

అవును... హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూనివర్శిటీకి వెళ్లాలనుకునేవారికి "ఎక్స్ ట్రా వెట్టింగ్" ఎదురుకానుందని అంటున్నారు. అక్కడకి ప్రయాణించే ఉద్దేశం ఏదైనా కానీ.. వారిపై ఈ చర్యలు తప్పవని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారని ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి!

కొత్తగా హార్వర్డ్ లో చేరాలనుకునే విద్యార్థులే కాకుండా ఇప్పటికే అందులో చదువుతున్నవారు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, గెస్ట్ స్పీకర్లు మొదలైనవారు హార్వర్డ్ కు బయలుదేరనున్న సంగతి తెలిసిందే! ఈ సమయలో.. అక్కడికి ప్రయాణించే ఉద్దేశం ఏదైనా ఎక్స్ ట్రా వెట్టింగ్ చర్యలు తప్పవనే చర్చ తెరపైకి వచ్చింది. తక్షణమే దీన్ని ఈమలు చేయాలని విదేశాంగ శాఖ అన్ని ఎంబసీ, కాన్సులేట్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.

కాగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీల్లో కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అప్పుడే "సోషల్ మీడియా వెట్టింగ్" అనే పదం వైరల్ అయ్యింది. అంటే.. వీసా అప్లికేషన్స్ కు అనుమతి ఇవ్వొచ్చా, లేదా అనేదాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్ లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేస్తారన్నమాట. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు.

ఇలా సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. దీనిపై ప్రస్తుతం అమెరికా సన్నాహాలు చేపట్టినట్లు చెబుతున్నారు. అప్పటివరకూ ఎలాంటి వీసా ఇంటర్వ్యూ అపాయింట్లు ఉండకుండా నిలిపివేశారు! ఈ తనిఖీలకు గల కారణాలను చెబుతూ.. ఉగ్రవాదులను నియంత్రించడం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడానికే అని తెలిపింది.