ఎలాన్ మస్క్ మైండ్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
అవును... ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు మస్క్ మధ్య వైరం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Jun 2025 10:31 AM ISTఅమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య వైరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వీరిరువురూ బహిరంగంగా ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు, వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ తో విభేదాలు మరింత పెంచేలా అనేట్లుగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు మస్క్ మధ్య వైరం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ గురించి మరోసారి మీడియా ప్రశ్నించగా... తాను చాలా బిజీగా ఉన్నానని.. చైనా, ఇరాన్, రష్యా సంబంధిత విషయాలపై పని చేస్తున్నానని.. తనకు చాలా పనులున్నాయని అన్నారు.
ఈ సమయంలో తాను ఎలాన్ మస్క్ గురించి ఆలోచించడం లేదని చెప్పిన ట్రంప్.. ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం. మరోపక్క... మస్క్ ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయబోతున్నారంటూ వస్తోన్న కథనాలపైనా ట్రంప్ స్పందించారు. ఇందులో భాగంగా... మస్క్ చాలా సబ్సిడీలు పొందారని.. పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో తాము అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటామని.. మస్క్ పొందిన సబ్సిడీలు, అందుకున్న డబ్బులు అన్నీ పారదర్శకంగా జరిగాయా లేదా అనే విషయాన్ని చూడాలని అన్నారు. ఈ సందర్భంగా... తాను ఒక్కడిని తప్ప ఎవరు లేకపోయినా అమెరికాకు ఏమీ కాదని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే... మస్క్ తో ప్రైవేటుగా మాట్లాడాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నరంటూ వస్తోన్న కథనాలపైనా ప్రెసిడెంట్ స్పందించారు. తనకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని.. ఎవరో ఆ కథనాలు తప్పుగా రాశారని.. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ఉద్దేశ్యమే లేదని.. పైగా ఎలాన్ మస్క్ మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీంతో... డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు.. మస్క్ తో ఉన్న విభేదాలను మరింత పెంచేలా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... ట్రంప్ తో విభేదాలు కొనసాగుతున్న వేళ ఎలాన్ మస్క్ వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. 80 శాతం అమెరికన్లు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా అంటూ తన 22 కోట్ల ఫాలోవర్లను ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ఎలాన్ మస్క్!
