Begin typing your search above and press return to search.

నేను లేకపోతే ట్రంప్ ఓడిపోయే వారు.. మస్క్ ఘాటు వ్యాఖ్యలు

ఈ విమర్శలకు బదులిస్తూ మస్క్ ట్రంప్‌పై మరింత ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్‌ను కృతజ్ఞత లేనివాడని అభివర్ణించారు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 9:47 AM IST
నేను లేకపోతే ట్రంప్ ఓడిపోయే వారు.. మస్క్ ఘాటు వ్యాఖ్యలు
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉండి.. ఒకరికొకరు మద్దతుగా నిలిచిన ఈ ఇద్దరు ప్రముఖులు, అమెరికా కేంద్ర బడ్జెట్ బిల్లు విషయంలో పరస్పర విమర్శలకు దిగారు. ఎలాన్ మస్క్ తనపై చేసిన విమర్శలపై ట్రంప్ చాలా ఆశ్చర్యం, నిరాశ వ్యక్తం చేశారు. ఎలాన్‌ మస్క్ తో తనకు గొప్ప బంధం ఉండదని ట్రంప్ వ్యాఖ్యానించారు. పన్నులు తగ్గించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం వంటి ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మస్క్ చేపట్టిన లాబీయింగ్ ప్రయత్నాలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మస్క్ ఈ చర్యను కొందరు రిపబ్లికన్లు కూడా విమర్శించారు.

ఈ విమర్శలకు బదులిస్తూ మస్క్ ట్రంప్‌పై మరింత ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్‌ను కృతజ్ఞత లేనివాడని అభివర్ణించారు. "నేను లేకపోతే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారు" అని మస్క్ అన్నారు. ఇది వారిద్దరి మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్పష్టం చేస్తోంది. మస్క్ గత వారం ఇంధన శాఖలో 129 రోజులు పనిచేసిన తర్వాత తన పదవి నుంచి వైదొలిగారు. ట్రంప్ మే 30న జరిగిన అభినందనల వార్తా సమావేశంలో మస్క్‌కు గోల్డ్ కీని బహూకరించారు. అయితే, ఆ తర్వాత రోజుల్లో ట్రంప్ బడ్జెట్ బిల్లును పదే పదే విమర్శించారు. ఈ బిల్లుకు ఓటు వేసిన వారికి సిగ్గు లేదని, వారు తప్పు చేశారని ఆయన సోషల్ మీడియాలో సోస్ట్ చేశారు.

ట్రంప్ పార్టీకి చెందిన కొద్దిమంది ప్రతినిధులతో పాటు, డెమొక్రాట్లందరూ ఈ బిల్లును వ్యతిరేకించారు. అయితే, చాలా మంది రిపబ్లికన్ల మద్దతుతో, వైట్ హౌస్ కేంద్ర బడ్జెట్ బిల్లును ఆమోదించింది. ఈ పరిణామం ట్రంప్, మస్క్ మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలను మరింత పెంచిందని స్పష్టమవుతోంది. మస్క్ తనను 'రుణ బానిసత్వ బిల్లు' అని అభివర్ణించిన ఈ బడ్జెట్ బిల్లు, ట్రంప్ దృష్టిలో మాత్రం అమెరికా అభివృద్ధికి కీలకమైనది. ఈ విభేదాలు భవిష్యత్తులో అమెరికా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.