స్విట్జర్లాండ్ లో ట్రంప్ బటన్.. భారత్ కు టెన్షన్.. ఇదే రీజన్!
అవును... రష్యా నుంచి ఇంధన కొనుగోలు పేరుచెప్పి, సుంకాలను రెట్టింపు చేసిన తర్వాత.. కొనసాగుతున్న వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్ తో వాణిజ్య చర్చలు ఉండవని ట్రంప్ తెలిపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Aug 2025 3:00 AM ISTమేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక్క మాట పట్టుకుని ప్రపంచంలోని ఎన్నో దేశాలకు కొత్త కష్టాలు, ఆర్థిక వ్యవస్థలకు పెను సవాళ్లు, సమస్యలు తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్! ఈ క్రమంలో అనేక దేశాల నుంచి దిగుమతులపై ఆయన విధించిన సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలకు సంబంధించిన మరో కీలక అంశం తెరపైకి వచ్చింది.
అవును... రష్యా నుంచి ఇంధన కొనుగోలు పేరుచెప్పి, సుంకాలను రెట్టింపు చేసిన తర్వాత.. కొనసాగుతున్న వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్ తో వాణిజ్య చర్చలు ఉండవని ట్రంప్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత దిగుమతులపై 50 శాతం సుంకాల వల్ల మన జీడీపీ వృద్ధి 0.3 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గుతుందని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు.
ఇంతలో అమెరికా 1 కిలోగ్రాముల బంగారు కడ్డీల దిగుమతులపై సుంకాలు విధించిందనే మీడియా నివేదికలు ఇప్పుడు పసుపు లోహంలో ర్యాలీకి ఆజ్యం పోశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రమైన స్విట్జర్లాండ్ కు మరో వాణిజ్య దెబ్బ తగిలేలా.. అమెరికా 1 కిలోగ్రాముల బంగారు కడ్డీల దిగుమతులపై సుంకాలు విధించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక సూచించింది.
కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ నుండి వచ్చిన లేఖను ఉటంకిస్తూ వెలువడిన ఈ నివేదిక తర్వాత న్యూయార్క్ ఫ్యూచర్స్ అండ్ స్పాట్ ధరల మధ్య ధర $100 కంటే ఎక్కువ పెరిగింది. జూలై 31న రాసిన ఆ లేఖలో.. 1 కిలోతో పాటు 100 ఔన్సుల బంగారు కడ్డీలను అధిక సుంకాలకు లోబడి కస్టమ్స్ కోడ్ కింద వర్గీకరించాలని పేర్కొంది.
దీంతో... ఈ చర్య ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రమైన స్విట్జర్లాండ్ ను ప్రభావితం చేస్తుంది. ఈ సందర్భంగా స్పందించిన సింగపూర్ లోని గోల్డ్ సిల్వర్ సెంట్రల్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ లాన్... బంగారు కడ్డీలపై సుంకాల వల్ల ధరలు దాదాపు ప్రతిచోటా పెరిగాయని అన్నారు. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు మరుగైన ఒప్పందాల కోసం చూస్తున్నాయని చెబుతున్నారు.
కాగా ఇప్పటికే బంగారం ధరలు శుక్రవారం ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 760 పెరిగి.. రూ.1,03,310 దగ్గర.. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.700 పెరిగి.. తులం బంగారం ధర రూ.94,700 దగ్గర తొలుత ట్రేడ్ అయ్యింది!
