ఒబామాను ఛేజ్ చేస్తున్న ట్రంప్, వాన్స్... పోస్ట్ వైరల్!
అవును... అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఎఫ్.బీ.ఐ. అధికారులు అరెస్టు చేస్తున్నట్లుగా ఉన్న ఓ ఏఐ వీడియోను ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 July 2025 2:00 PM ISTఇటీవల అమెరిక మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సంబంధించి ఓ వీడియోను డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఓవల్ ఆఫీసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు ఒబామాను అరెస్టు చేస్తున్నట్లుగా ఆ వీడియోను రూపొందించారు. ఈ సందర్భంగా... 'చట్టానికి ఎవరూ అతీతులు కారు' అనే మెసేజ్ ఇస్తూ ఒబామాపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ విషయం వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ముందుగా... 'చట్టానికి అధ్యక్షుడు అతీతుడే' అని ఒబామా అన్నట్లుగా ఉండగా.. అనంతరం.. 'చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు' అని పలువురు రాజకీయ నాయకులు మాట్లాడినట్లు ఉంది. చివరకు ట్రంప్, ఒబామా మాట్లాడుకుంటుండగా ఎఫ్.బీ.ఐ అధికారులు ఎంట్రీ ఇచ్చి, మాజీ అధ్యక్షుడి చేతికి సంకెళ్లు వేసినట్లుగా ఈ వీడియోను రూపొందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ నుంచి ఒబామాకు సంబందించిన మరో పోస్ట్ తెరపైకి వచ్చింది.
అవును... అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఎఫ్.బీ.ఐ. అధికారులు అరెస్టు చేస్తున్నట్లుగా ఉన్న ఓ ఏఐ వీడియోను ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ మరో మీమ్ పోస్టు చేశారు. ఇందులో.. ఒబామా ఫోర్డ్ బ్రోంకో కారులో పారిపోతుండగా.. వెనుక ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అతర అధికారులు పోలీసు వాహనాల్లో వెంబడిస్తున్నట్లుగా ఆ పోస్ట్ ఉంది!
ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారుతుండగా... ఈ పోస్టుకు స్పందించిన వాన్స్.. నవ్వుతున్న ఎమోజీని జత చేశారు. దీంతో... ట్రంప్ యంత్రాంగం ఒబామాపై ఎలాంటి చర్యలు తీసుకోనుందనే చర్చ బలంగా మొదలైంది. కాగా... ఇటీవల యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఒబామాపై సంచలన ఆరోపణలు చేసిన అనంతరం ట్రంప్ & కో నుంచి ఇలా వరుస పోస్టులు వస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా... అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా భారీఎత్తున మోసాలకు పాల్పడ్డారంటూ ట్రంప్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు, 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత.. ఆయన పాలనను నియంత్రించేందుకు ఒబామా సన్నిహిత వర్గాలు అసత్య ప్రచారం చేశాయని తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒబామాపై వరుస పోస్టులు వస్తున్నాయి! దీంతో... ఒబామా అరెస్టుకు ట్రంప్ ముహూర్తం పెట్టేశారా అనే ప్రశ్నలు దర్శనమిస్తున్నాయి.
