Begin typing your search above and press return to search.

'ఇజ్రాయెల్, ఇరాన్ పిల్లల మాదిరి'... 'ఎఫ్' వర్డ్ పై ట్రంప్ క్లారిటీ!

అవును... ఇజ్రాయెల్, ఇరాన్‌ లు సీజ్ ఫైర్ ఉల్లంఘించడంపై "ఎఫ్" వర్డ్ వాడిన ట్రంప్.. దానిపై వివరణ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   25 Jun 2025 6:57 PM IST
ఇజ్రాయెల్, ఇరాన్  పిల్లల మాదిరి... ఎఫ్ వర్డ్  పై ట్రంప్  క్లారిటీ!
X

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ ల మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులకు శుభం కార్డు పడిందని.. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఇరు దేశాలు కూడా ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు ప్రకటనలు చేసినప్పటికీ.. మరోసారి వారి మధ్య దాడులు కొనసాగాయి.

దీంతో... ట్రంప్ ఒక్కసారిగా నిప్పులు చెరిగారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరిందని.. ఇదంతా తన మధ్యవర్తిత్వ ఫలితమని.. పశ్చిమాసియాలో తాను తిరిగి శాంతిని నెలకొల్పానని.. ఇరాన్‌ తోపాటు ఇజ్రాయెల్‌ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘిచిందని అన్నారు. ఇజ్రాయెల్‌ చర్యపట్ల తాను సంతోషంగా లేనని, టెల్‌ అవీవ్‌ శాంతించాలని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... మరింత స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన ట్రంప్.. ఈ రెండు దేశాలు చాలా కాలంగా ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయని.. వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అని అంటూ... "ఎఫ్" వర్డ్ ఉపయోగించారు. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ఇరు దేశాలపై "ఎఫ్" వర్డ్ వాడటంపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.

అవును... ఇజ్రాయెల్, ఇరాన్‌ లు సీజ్ ఫైర్ ఉల్లంఘించడంపై "ఎఫ్" వర్డ్ వాడిన ట్రంప్.. దానిపై వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగా... ఆ రెండు దేశాలను ఒక స్కూలు కాంపౌండ్ లోని ఇద్దరు పిల్లలతో పోల్చిన ట్రంప్.. కొన్నిసార్లు వారిని సరైన మార్గంలోకి తీసుకురావడానికి "బలమైన భాష"ను ఉపయోగించాల్సి ఉంటుందంటూ.. "ఎఫ్" వర్డ్ వాడటంపై క్లారిటీ ఇచ్చారు.

నాటో శిఖరాగ్ర సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు సీజ్ ఫైర్ కు అంగీకరించిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు లభించిందని నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలోనే... స్కూల్ ఆవరణలోని ఇద్దరు పిల్లల్లాగే వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని.. వాళ్ళు ఘోరంగా గొడవ పడతారని.. వారిని మనం ఆపలేమని అన్నారు.

అయితే... వాళ్లు రెండు, మూడు నిమిషాలు పోరాడిన తర్వాత వాళ్ళని ఆపడం సులభం అవుతుందని ట్రంప్ తనదైన శైలిలో చమత్కరించారు. ఇదే సమయంలో... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య 12 రోజుల పాటు జరిగిన క్షిపణుల దాడి.. వందలాది మంది పౌరులను బలిగొందని అన్నారు. ఆ యుద్ధాన్ని అమెరికా చేసిన దాడులు సమర్థవంతంగా ముగించాయని ట్రంప్ నొక్కి చెప్పారు.