Begin typing your search above and press return to search.

దంపతుల గొడవలో డోర్స్ క్లోజ్ చేసుకోవాలి.. ట్రంప్ చమత్కారం!

ప్రపంచంలో జరిగే ఆసక్తికర విషయాలపై అంతకు మించిన ఆసక్తికరంగా స్పందించడంలో డొనాల్డ్ ట్రంప్ దిట్ట అనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 May 2025 9:32 AM IST
దంపతుల గొడవలో డోర్స్  క్లోజ్  చేసుకోవాలి.. ట్రంప్  చమత్కారం!
X

ప్రపంచంలో జరిగే ఆసక్తికర విషయాలపై అంతకు మించిన ఆసక్తికరంగా స్పందించడంలో డొనాల్డ్ ట్రంప్ దిట్ట అనే సంగతి తెలిసిందే. కొన్ని విషయాలపై స్పందించమని అడిగితే జర్నలిస్టులపై ఫైర్ అవుతారు కానీ.. మరికొన్నింటి గురించి అడిగినప్పుడు మాత్రం తనదైన శైలిలో చమత్కరిస్తారు. ఈ క్రమంలో తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్యామిలీ మేటర్ విషయంలో ఇలానే స్పందించారు.

అవును... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రన్, ఆయన సతీమణి బ్రిగెట్టా మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని ఇటీవల ఫ్రెంచ్ మీడియాలో కథనాలొచ్చాయి. వీటికి బలం చేకూరుస్తూ.. ఇటీవల మెక్రాన్ ముఖాన్ని బ్రిగెట్టా నెట్టినట్టుగా ఉన్న ఓ వీడియో తెరపైకి వచ్చి, వైరల్ గా మారింది. దీనిపైనే తాజాగా ట్రంప్ స్పందించారు.

తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మెక్రన్ - బ్రిగెట్టా వీడియోపై స్పందించాలని ఓ విలేకరి ట్రంప్ ను కోరారు. దీనిపై స్పందించిన ట్రంప్... దీని గురించి తాను ఇప్పటికే నేరుగా మెక్రాన్ తోనే మాట్లాడినట్లు చెప్పారు. అంతా బాగానే ఉందని పేర్కొన్నారు. అనంతరం... అలాంటి ఘటనలు జరిగినప్పుడు తలుపులు వేసి ఉన్నాయో, లేదో ఒకసారి గమనించుకోవాలని చమత్కరించారు.

కాగా... ఇటీవల వియత్నాం పర్యటనకు వెళ్లిన మెక్రాన్ - బ్రిగెట్టా దంపతుల మధ్య హనోయ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటన ఈ చర్చకు దారి తీసింది. ఇందులో భాగంగా... విమానం హనోయ్ లో దిగిన తర్వాత.. ఓ అధికారి తలుపు తెరిచినప్పుడు మెక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే రెడ్ స్లీవ్స్ ధరించిన రెండు చేతులు మెక్రాన్ ను నెట్టివేశాయి.

దీంతో.. వెంటనే ఆయన తలతిప్పి వెనక్కి జరిగారు. దీనికి సంబంధించిన దృశ్యం రికార్డ్ అవుతున్నట్లు గమనైంచిన ఆయన చిరునవ్వుతో అభివాదం చేశారు! ఆ తర్వాత బ్రిగెట్టా ఎర్రని జాకెట్ వేసుకొని మెక్రాన్ తో కలిసి విమానం దిగుతూ కనిపించారు. ఆ సమయంలో ఆమె చేతిని మెక్రాన్ పట్టుకోడానికి ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన మెక్రాన్.. ఆ సందర్భాన్ని ప్రతిఒక్కరూ తప్పుగా అర్ధం చేసుకున్నారని, తమ మధ్య ఎలాంటీ గొడవ లేదని, అది తమ మధ్య జరిగిన సరదా సన్నివేశమని అన్నారు. ఆ వీడియోలో నా భార్యతో జోక్ చేశాను.. ఇది మా మధ్య ఎప్పుడూ జరిగేదే అంటూ వివరణ ఇచ్చారు. దీనిపైనే ట్రంప్ తాజాగా స్పందించారు.