వీడియో... ట్రంప్ పై సౌతాఫ్రికా ప్రెసిడెంట్ విమానం చమత్కారం!
అవును... దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా, ట్రంప్ భేటీ నేపథ్యంలో శ్వేతసౌధంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
By: Tupaki Desk | 22 May 2025 7:00 PM ISTసౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, డొనాల్డ్ ట్రంప్ తో భేటీ నేపథ్యంలో వైట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా అమెరికాకు ఖతార్ ఇచ్చిన విమానం బహుమతిపై రెండు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒకటి.. ట్రంప్ పై దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ చమత్కారం!
అవును... దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా, ట్రంప్ భేటీ నేపథ్యంలో శ్వేతసౌధంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా.. డొనాల్డ్ ట్రంప్ కు బహుకరించడానికి తన వద్ద విమానం లేదని సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి సరదాగా క్షమాపణలు చెప్పారు.
ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్... నువ్వు అలా చేస్తే బాగుండేది అని నేను కోరుకుంటున్నాను.. నేను దానిని తీసుకుంటాను.. మీదేశం, యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళానికి విమానం ఇస్తే నేను దానిని తీసుకుంటాను అని ట్రంప్ అన్నారు. ట్రంప్ కు ఖతార్ ప్రత్యేక విమానాన్ని బహుమతిగా ఇచ్చిన సందర్భంగా ఈ సరదా సంభాషణ జరిగింది.
మరోపక్క సుమారు $400 మిలియన్స్ ఖరీదైనట్లు అంచనా వేయబడుతున్న విమానం బహుమతి అమెరికాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇందులో భాగంగా... ఈ విషయం రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య నైతికత, చట్టబద్దతపై ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో ఈ విమానం గురించి అడిగిన విలేకరిపై ట్రంప్ చిందితులు తొక్కారు.
ఇందులో భాగంగా... దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస, తదితర సమస్యల గురించి మాట్లాడుతుంటే.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? వాటి నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావ్! నీకు విలేకరిగా విధులు నిర్వహించే అర్హత లేదు.. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఫైర్ అయిపోయారు.
అసలు తాము మాట్లాడుతున్నదానికి ఖతర్ విమానానికి సంబంధం ఏమిటి? వాళ్లు విమానం ఇచ్చారు.. అది చాలా గొప్ప విషయం.. అయితే, అది ఇప్పుడు ప్రశ్నించే సమయమా? అని మండిపడుతూ.. అతనితో పాటు ఆ వార్తా సంస్థపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. దీనిపై విచారణ జరపాల్సి ఉందని అన్నారు.
