మెలోని అంటే తనకు చాలా ఇష్టం .. వాణిజ్య యుద్ధంలో మరో ట్విస్ట్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలనంతో వార్తల్లో నిలుస్తున్నారు.
By: Tupaki Desk | 18 April 2025 10:15 AM ISTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలనంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. అంతే కాకుండా మెలోని గొప్ప ప్రధాని అని, వ్యక్తిగతంగానూ ఆమెతో మంచి అనుబంధం ఉందని తన పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమెలో చాలా ప్రతిభ ఉందని, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరంటూ కొనియాడారు. బారెఫ్స్ వంపుపై అమెరికా వైఖరిని మెలోని వ్యతిరేకించినా, యూరోపియన్ దేశాల నుంచి ట్రంప్‌ను కలిసిన తొలి ప్రధాని ఆవిడే.
ట్రంప్, మెలోనిల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం, రాజకీయపరమైన సాన్నిహిత్యం ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, యూరోపియన్ దేశాల నుండి ట్రంప్‌ను కలిసిన తొలి ప్రధాని మెలోని కావడంతో, వారిద్దరి మధ్య సంబంధం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. మెలోనిని డొనాల్డ్ ట్రంప్ పొగడటం, తన నాయకత్వ లక్షణాలను కొనియాడడం వారిద్దరి మధ్య ఉన్న బలమైన బంధాన్ని సూచిస్తుంది. అయితే, బారెఫ్స్ వంపు విషయంలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అది వారి స్నేహానికి అడ్డుకాదని ట్రంప్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో అమెరికా, యూరోపియన్ దేశాల మధ్య వాణిజ్య సుంకాలపై ఉద్రిక్తతలు పెరిగాయి. ట్రంప్ సుంకాల విధానం కారణంగా అనేక దేశాలు స్పందించాయి. ఈ సమయంలో మెలోని చొరవ తీసుకుని డొనాల్డ్ ట్రంప్‌తో నేరుగా చర్చలు నిర్వహించారు. ఈ సమావేశం అమెరికా, ఇటలీ దేశాల మధ్య సంబంధాలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. డొనాల్డ్ ట్రంప్, జియోర్జియా మెలోని అమెరికా-యూరోపియన్ సంబంధాలను ప్రభావితం చేసే వాణిజ్య ఉద్రిక్తతలను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.27 దేశాల యూరోపియన్ యూనియన్ స్టీల్, అల్యూమినియం, కార్ల మీద 25శాతం దిగుమతి సుంకాన్నీ ఎదుర్కొంటొంది. ట్రంప్ టారీఫ్ విధానం ప్రకారం.. దాదాపు అన్ని ఇతర వస్తువులపై పెద్దమొత్తంలో సుంకం విధించబడుతోంది.
గురువారం వైట్ హౌసులో భోజనానికి ముందు ట్రంప్‌తో మెలోని మాట్లాడుతూ.. మేమిద్దరం ఒక ఒప్పందానికి రాగలమని నాకు నమ్మకం ఉందన్నారు. మెలోని ట్రంప్‌ను ఇటలీకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జూన్ లో జరిగే తదుపరి నాటో సమావేశంలో ప్రతి సభ్య దేశం రక్షణ వ్యయంపై స్థూల జాతీయోత్పత్తిలో 2శాతం మేరకు ఖర్చు చేయాలనే కూటమి అవసరాన్ని తమ దేశం తీర్చగలదని ప్రకటిస్తుందని ఆశిస్తున్నట్లు మెలోనీ తెలిపారు. ట్రంప్, మెలోనిల మధ్య ఉన్న ఈ అనుబంధం.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.