Begin typing your search above and press return to search.

యుద్ద వీరుడికి నోబెల్‌ శాంతి బహుమతి కోరిక...!

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్న నోబెల్‌ బహుమతికి సంబంధించిన హడావిడి మరోసారి మొదలైంది.

By:  Tupaki Desk   |   1 May 2026 11:09 AM IST
యుద్ద వీరుడికి నోబెల్‌ శాంతి బహుమతి కోరిక...!
X

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్న నోబెల్‌ బహుమతికి సంబంధించిన హడావిడి మరోసారి మొదలైంది. నోబెల్‌ బహుమతి 2026కు సంబంధించిన ఎంట్రీలు ఇప్పటికే ఫైనల్‌ అయ్యారని, షార్ట్‌ లిస్ట్‌ సైతం రెడీ అయ్యిందని తెలుస్తోంది. ఇతర నోబెల్‌ బహుమతుల గురించి పక్కన పెడితే నోబెల్‌ శాంతి బహుమతి పై ప్రత్యేక దృష్టి ఉంది. గత ఏడాదిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోబెల్‌ శాంతి బహుమతిని బలంగా ఆశించాడు. ఎన్నో యుద్దాలు ఆపిన తనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాల్సిందే అనే ఒత్తిడి కూడా జ్యూరీ పై తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. తనకు అనుకూలంగా ఉండే పాకిస్తాన్‌తో పాటు కొన్ని దేశాలు ట్రంప్‌ కి నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చాలా పైరవీలు జరిగాయి. కానీ ట్రంప్‌ పైరవీలు వర్కౌట్‌ కాలేదు. 2025 సంవత్సరంలో ట్రంప్‌కి నిరాశే మిగిలింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...

అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్న పవర్‌తో ట్రంప్‌ కచ్చితంగా పలు దేశాల మధ్య యుద్దాలు రాకుండా ట్రంప్‌ అడ్డుకున్నాడు అనేది కొంత మేరకు వాస్తవం. అయితే ఆయన స్వయంగా యుద్ధానికి దిగడం ఈ మధ్య కాలంలో చర్చనీయాంశం అయింది. ఇరాన్‌తో డైరెక్ట్‌ వార్‌కు దిగిన అమెరికా అక్కడ అత్యంత దారుణమైన హింసాకాండకు తెర తీసిన విషయం తెల్సిందే. చిన్న పిల్లలు చదివే స్కూల్‌ పై బాంబు దాడులు చేశారు. వందలాది మంది ఇరానీ పిల్లలు చనిపోయారు. అమెరికా జరిపిన దాడుల్లో వేలాది మంది ఇరానీ లు చనిపోయారు. ఇప్పటికీ అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇంతటి యుద్ధంకు కారణం అయిన ట్రంప్‌కు ప్రంపచ వ్యాప్తంగా యుద్ద వీరుడు అని పేరు వచ్చింది. యుద్ధ వాంఛ ఉన్న అధ్యక్షుడు అంటూ ట్రంప్‌ పై అంతర్జాతీయ మీడియా తీవ్ర స్థాయిలో కథనాలు ప్రచురించడం గతంలో చూశాం.

అమెరికా సైన్యం చర్యలు...

వేలాది ఇరానీలు మంది అమెరికా సైన్యం చేతిలో చనిపోయారు. అమెరికా సైన్యం చేసిన యుద్ధంకు అధ్యక్షుడు ట్రంప్‌కు సంబంధం లేకుండా ఉండదు. మరి అలాంటప్పుడు ఎలా ట్రంప్‌కి శాంతి బహుమతి లభిస్తుందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు నోబెల్‌ బహుమతికి సంబంధించిన జాబితా విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. కానీ నోబెల్‌ శాంతి బహుమతి కోసం దాదాపుగా 287 నామినేషన్‌లు వచ్చాయని అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అందులో 208 మంది వ్యక్తుల పేర్లు, 79 స్వచ్ఛంద సంస్థల పేర్లు ఉన్నాయట. 208లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఒక వైపు సుదీర్ఘ కాలంగా రష్యాతో యుద్దం చేస్తున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరు సైతం ఉందనే వార్తలు వస్తున్నాయి.

నోబెల్‌ శాంతి బహుమతి 2026..

పలు దేశాల అధ్యక్షుల పేర్లతో పాటు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వారి పేర్లు ఉన్నాయి. దాంతో ట్రంప్‌ కి నోబెల్‌ శాంతి బహుమతి లభించే అవకాశాలు చాలా తక్కువ అని కొందరు అంటున్నారు. యుద్ధం వల్ల ఎంతో మంది చనిపోయారు, ఆ యుద్ధం కు ట్రంప్‌ ప్రత్యక్ష కారణం, ఆయన ఆదేశాలతోనే యుద్ధం జరిగింది, ఇప్పటికీ ఇరాన్‌ పై క్షిపణి దాడులు జరుగుతున్నాయి. కనుక నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ ఒక్క శాతం కూడా అర్హుడు కాదు అనేది అంతర్జాతీయ స్థాయి విశ్లేషకుల అభిప్రాయం. అయితే ట్రంప్‌ మాత్రం గతంలో మాదిరిగా ఈ సారి కూడా తనను తాను శాంతి దూత అన్నట్లుగా, పదుల కొద్ది యుద్ధాలు ఆపిన పవర్‌ ఫుల్‌ మ్యాన్‌ ను అన్నట్లుగానే చెప్పుకుంటున్నాడు. గతంతో పోల్చితే ఈసారి మరింత ఎక్కువ లాబీయింగ్‌ చేయడం ద్వారా ట్రంప్‌ తన కోరికను తీర్చుకుంటాడా అనేది చూడాలి. ట్రంప్‌ కి నోబెల్‌ శాంతి బహుమతి వస్తే దాని విలువ తగ్గడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.