Begin typing your search above and press return to search.

వామ్మో... ట్రంప్ ను సన్ బాత్ చేస్తున్నప్పుడు చంపేస్తారంట!

అవును... ఇటీవల పశ్చిమాసియాలోకి అమెరికా యుద్ధ విమానాలు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 July 2025 3:00 PM IST
వామ్మో... ట్రంప్  ను సన్  బాత్  చేస్తున్నప్పుడు  చంపేస్తారంట!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచ వ్యాప్తంగా శత్రువుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నట్లే కనిపిస్తోంది! ప్రపంచ పెద్దన్నగా అందరినీ కలుపుకుపోకుండా ఆధిపత్య ధోరణి అవలంభించడమే దీనికి కారణం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! ఈ క్రమంలో ఇటీవల అమెరికా బంకర్ బ్లస్టర్ బాంబుల దెబ్బ రుచి చూసిన ఇరాన్.. ట్రంప్ కు తమ దెబ్బ రుచి చూపిస్తామంటోంది.

అవును... ఇటీవల పశ్చిమాసియాలోకి అమెరికా యుద్ధ విమానాలు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - ఇరన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎంట్రీ ఇచ్చిన అమెరికా... టెహ్రాన్ లోని మూడు అణుకేంద్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఘోరమైన చావు చావకుండా తాము కాపాడామని ప్రకటించుకుంది, అతడిని చంపడం పెద్ద పనికాదని వెల్లడించింది.

ఈ సమయంలో ఇరాన్ స్పందించింది. ట్రంప్ కు ఊహించని స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగా.. ట్రంప్ ఫ్లోరిడాలోని తన నివాసం వద్ద సన్‌ బాత్‌ చేసే సమయంలో లక్ష్యంగా చేసుకుంటామని ఆ దేశ సీనియర్‌ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదని పేర్కొన్నారు. డ్రోన్ వచ్చి ట్రంప్ ను ఢీకొనే అవకాశం ఉందని అన్నారు!

వివరాళ్లోకి వెళ్తే... ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు జావద్‌ లారిజాని తాజాగా ట్రంప్ కు హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక మీడియాలో ప్రసారమైన ఆయన వ్యాఖ్యల్లో... ట్రంప్‌ కు ఫ్లోరిడాలోని మార్‌-ఎ-లాగో రిసార్ట్‌ కూడా ఇకపై సురక్షితం కాదని పేర్కొన్నారు. ఆయన సన్‌ బాత్‌ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్‌ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు.

పైగా.. ఇది తమకు చాలా సులభమైన పని అని లారిజాని వ్యాఖ్యానించారు. 2020లో ఇరానియన్‌ టాప్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్‌ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు. అయితే... ఈ బెదిరింపులపై ట్రంప్ స్పందించారు. లారిజాని వ్యాఖ్యలను ముప్పు అనే అనుకుంటున్నట్లు తెలిపారు.. వాస్తవానికి అది నిజమో, కాదో తెలియదు.. బహుశా కావొచ్చు కూడా అని స్పందించారు.

ఈ సందర్భంగా 'మీరు చివరిసారిగా ఎప్పుడు సన్‌ బాత్‌ కు వెళ్లారు' అనే ప్రశ్నకు నవ్వుతూ స్పందించిన ట్రంప్‌.. తనకు 7ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అని చెబుతూ, అది తనకు అంతగా ఇష్టం ఉండదని సమాధానమిచ్చారు.

కాగా... ట్రంప్‌ కు రివార్డు ఇవ్వాలని బ్లడ్‌ పాక్ట్‌ అనే ప్లాట్‌ ఫామ్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాట్‌ ఫామ్‌ ఇరాన్‌ నాయకత్వానికి శత్రువులుగా భావిస్తున్న వారిపై, ఖమేనీని అమర్యాదగా సంబోధించిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అవసరమైన నిధులను సేకరిస్తుంది. ఈ క్రమంలో జులై 8 నాటికి ఇది 27 మిలియన్‌ డాలర్లను సేకరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి బెదిరింపులు రావడం గమనార్హం.