Begin typing your search above and press return to search.

ట్రంప్ ఉత్సాహం....విపక్షాల ఆగ్రహం!

అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే ఆయన ప్రపంచ ప్రెసిడెంట్ ఏ మాత్రం కాదు అంటున్నారు సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఎ బేబీ.

By:  Tupaki Desk   |   13 May 2025 9:29 AM IST
ట్రంప్ ఉత్సాహం....విపక్షాల ఆగ్రహం!
X

అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే ఆయన ప్రపంచ ప్రెసిడెంట్ ఏ మాత్రం కాదు అంటున్నారు సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఎ బేబీ. అసలు భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏమిటి అని ఆయన నిరసన వ్యక్తం చేశారు. నిజంగా అమెరికా పాత్ర ఉంటే అది ఎంత ఉందో కేంద్రం బయటపెట్టాలని కోరారు.

అంతే కాదు భారత్ కాల్పుల విరమణ గురించి ప్రకటించక ముందే ట్రంప్ ఎలా ప్రకటిస్తారని ఆయనకు ముందుగా సమాచారం ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు ఇక దేశ సార్వభౌమత్వం ఇబ్బందులో పడింది అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సింలా ఒప్పందం ప్రకారం పాక్ భారత్ రెండు దేశాలూ కలసి కూర్చుని ఏ సమస్య అయినా పరిష్కరించుకోవాలి తప్పించి మూడవ మధ్యవర్తిత్వం ఎందుకు అని ఆ పార్టీ అంటోంది.

ఇదే మాటను ఎన్సీపీ నేత శరద్ పవార్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తన సొంత నిర్ణయాలు తాను తీసుకోకుండా అంతర్జాతీయంగా తీసుకుని వెళ్ళడమేంటని ఆయన ఫైర్ అయ్యారు. ఈ విషయంలో కేంద్రం జవాబు చెప్పాలని అంటున్నారు. ఈ అంశాల మీద చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయమని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు.

ఇక మే 10న ట్రంప్ చేసిన ట్వీట్ కొంప ముంచేదిగా ఉందని అంతా భావిస్తూంటే లేటెస్ట్ గా ట్రంప్ మరో ట్వీట్ చేశారు. భారత్ పాక్ ల మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపాను అని ఆయన చెప్పారు. అంతే కాదు అణు యుద్ధం వస్తే కనుక లక్షలాది మంది ప్రజలు రెండు వైపులా చనిపోయేవారు అని అన్నారు.

అంతే కాదు యుద్ధం ఆపకపోతే రెండు దేశాలతో తాను వాణిజ్యం చేయను అని కూడా స్పష్టంగా చెప్పను అని ఆయన అంటూ యుద్ధం ఆగినా కాల్పుల విరమణ జరిగినా అంతా తన పుణ్యమే అని చెప్పుకుంటున్నారు. ఇక యుద్ధం విషయంలో తాను భారత్ తో చర్చలు జరుపుతున్నట్లుగా వెల్లడించారు. తా తరువాత పాక్ తో కూడా మాట్లాడుతాను అని కూడా అంటున్నారు.

మొత్తానికి తాను ప్రపంచ పెద్దన్నను అన్న విధంగా ట్రంప్ ఒక వైపు చెబుతూంటే మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఎక్కడా కాల్పుల విరమణ గురించి కానీ ట్రంప్ చేసిన ట్వీట్ల గురించి కానీ ప్రస్తావించలేదు. మరో వైపు చూస్తే అసలు మూడవ వ్యక్తి కానీ దేశం కానీ మధ్యవర్తిత్వం తమకు అక్కరలేదు అన్నది కూడా కేంద్రం స్పష్టంగా బాహాటంగా చెప్పడం లేదని విపక్షాలు అంటున్నారు.

సడెన్ గా కాల్పుల నిర్ణయం వెనక ఎవరి సలహా ఉది అసలు అణు యుద్ధం జరిగేందుకు ఆస్కారం ఉందా ఉంటే కనుక పాక్ అంతకు తెగించిందా ఆ విషయం అమెరికాకు తెలిసి ఆపిందా లేక ఎవరు ప్రమాదకరమైన యుద్ధానికి తెర తీశారు ఇవన్నీ ప్రశ్నలుగా ఉన్నాయి. జవాబులు దొరుకుతాయేమో చూడాల్సి ఉంది.