వారంలోగా మరో సీజ్ ఫైర్ కు ట్రంప్ సిద్ధం.. వారికి గుడ్ న్యూస్!
2023 అక్టోబర్ లో తమ దేశంలోకి ప్రవేశించి, అమాయకులైన పౌరులను ఊచకోత కోసినందుకు ప్రతీకారంగా గాజాపై యుద్ధం మొదలుపెట్టింది ఇజ్రాయెల్.
By: Tupaki Desk | 29 Jun 2025 10:55 AM ISTప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, సంఘర్షణలను తానే ఆపుతున్నానని.. తాను ప్రపంచ శాంతి దూతను అని.. భారత్ - పాక్ యుద్ధాన్ని తానే ఆపానని.. ఇజ్రాయెల్ - ఇరాన్ సీజ్ ఫైర్ తనవల్లే అని.. తద్వారా తాను నోబెల్ శాంతి బహుమతికి యునానిమస్ గా అర్హుడిని అని చెబుతున్న ట్రంప్.. తాజాగా మరో కాల్పుల ఒప్పందానికి సమయం ఆసన్నమైందని అన్నారు.
2023 అక్టోబర్ లో తమ దేశంలోకి ప్రవేశించి, అమాయకులైన పౌరులను ఊచకోత కోసినందుకు ప్రతీకారంగా గాజాపై యుద్ధం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ఆరోజు నుంచి నేటి వరకూ ఆ ప్రాంతాన్ని గడగడలాడించేస్తుంది. ఫలితంగా ఆ ప్రాంతంలోని పౌరుల పరిస్థితి అత్యంత దయణీయంగా మారిపోయింది. ఈ సమయంలో పాలస్తీనా పౌరులకు ట్రంప్ వారికి గుడ్ న్యూస్ చెప్పారు.
అవును... గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... వచ్చే వారంలోపు ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పేర్కొన్నారు. చర్చల ప్రక్రియలో ఉన్నవారితో మాట్లాడామని.. వచ్చే వారంలోపు కాల్పుల విరమణ జరుగుతుందని అశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
మరోవైపు ఇటీవల గాజాలో ఆహారం కోసం సహాయ కేంద్రాల దగ్గరకు వస్తున్న పాలస్తీనియులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపడం, ఆ కాల్పుల్లో 40 మంది వరకూ మరణించగా, 70 మంది వరకూ గాయపడ్డారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఆహారం లేక ఇసుక తింటున్నామని చెప్పిన మాటలు ప్రపంచాన్ని కదిలించాయి.
ఈ నేపథ్యంలో గాజాలో ఆహారం కోసం సహాయ కేంద్రాల దగ్గరకు వస్తున్న పాలస్తీనియులపై కాల్పులు జరపాలని తాము ఆదేశాలివ్వలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ దినపత్రిక 'హర్జెట్'లో శుక్రవారం వచ్చిన కథనాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
ఇక గాజాలో పరిస్థితి ప్రస్తుతానికైతే ఏఈ మారలేదనే చెప్పాలి. ఓ వైపు కాల్పుల విరమణ చర్చలు కొలిక్కి వస్తున్నాయన్న వార్తలు వెలువడుతున్నా, గాజాలో మరణమృదంగం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో... శుక్రవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడుల్లో 72 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య సిబ్బంది పేర్కొన్నారు.
